బిజినెస్

ప్రపంచ సంపన్నుల జాబితాలో జుకెన్‌బర్గ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టామ్ మెటకాఫ్, బ్లూంబర్గ్, జూలై 7: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో వారెన్ బఫెట్‌ను అధిగమించిన ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకెన్‌బర్గ్ మూడోస్థానాన్ని ఆక్రమించాడు. అతని కంటే ముందు ఒకటి రెండు స్థానాల్లో అమెజాన్.కామ్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ మాత్రమే ఉన్నారు. ఫేస్‌బుక్ షేర్ల విలువ 2.4 శాతం ఎగబాకడంతో జుకెన్స్‌బర్గ్‌కు ఈ హోదా లభించినట్టు బ్లూంబర్గ్ బిలియనర్ల ఇండెక్స్ పేర్కొంది. ఈ సంస్థ ప్రపంచంలోని 500 మంది ధనవంతుల జాబితాను న్యూయార్కులోని ట్రేడింగ్ ముగిసిన వెంటనే ఏ రోజుకారోజు ప్రకటిస్తుంది. టెక్నాలజీ రంగంలో పేరుపొందిన ముగ్గురు వ్యక్తులు ఒకేసారి సంపదలో మొదటి మూడుస్థానాలు ఆక్రమించడం ఇదే మొదటిసారి. జుకెనర్ బర్గ్ 81.6 బిలియన్ డాలర్లు (్భరత్ కరెన్సీలో 5.61 లక్షల కోట్లు) సంపదతో వారెన్ బఫెట్ కన్నా 373 మిలియన్ డాలర్లు (2,565 కోట్లు) అధిక సంపదతో మూడోస్థానాన్ని ఆక్రమించారు. ఒకప్పుడు వారెన్ బఫెట్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతునిగా నిలచారు. అయితే తన సంపదలోని 290 మిలియన్ల డాలర్లను చారిటీ, ఇతర సంక్షేమ కార్యక్రమాలకు ఇచ్చారు. వీటిలో ఎక్కువశాతం గేట్స్ ఫౌండేషన్‌కు ఇచ్చారు.