బిజినెస్

మదుపరుల దృష్టి వర్షాలపైనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 3: వర్షాలు, అంతర్జాతీయ మార్కెట్ల తీరుతెన్నులు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్ల కదలికలను ప్రభావితం చేస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ (ఈయు) నుంచి బ్రిటన్ వైదొలిగిన (బ్రెగ్జిట్) నేపథ్యంలో అంతకుముందు వారం భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. గత వారం కోలుకున్నది తెలిసిందే. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 747.20 పాయింట్లు పెరిగితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 239.75 పాయింట్లు ఎగిసింది. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇందుకు దోహదం చేశాయి. ఈ క్రమంలో ఈ వారం సూచీలు కొంత ఒడిదుడుకులకు లోనయ్యే వీలుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించే వర్షాలపై మదుపరుల చూపు ఉంటుందని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వం చేపట్టే సంస్కరణలపైనా దృష్టి నిలుస్తుందని పేర్కొంటున్నారు. ఇకపోతే ఎప్పటిలాగే ఈసారి కూడా డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారత స్టాక్ మార్కెట్ ట్రేడింగ్‌ను ప్రభావితం చేస్తాయని అంటున్నారు.