బిజినెస్

స్థూలార్థిక గణాంకాలే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: దేశ స్థూలార్థిక గణాంకాలు, కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఆదాయాలు, ప్రపంచ వాణిజ్య సంబంధాలు వంటి కీలకాంశాలు సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల గమనాన్ని నిర్దేశించనున్నాయనేది నిపుణుల అంచనా. ‘మదుపరుల దృష్టి ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) గణాంకాలు, రుతపవనాలు వంటి అంశాలపై కేంద్రీకృతమయి ఉంటుంది. అంతర్జాతీయంగా చూస్తే, వాణిజ్య సంబంధాలపై దృష్టి కేంద్రీకృతమయి ఉంటుంది’ అని కోటక్ సెక్యూరిటీస్ పరిశోధన విభాగం వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ జర్బాడే పేర్కొన్నారు. ఐటీ దిగ్గజాలయిన టీసీఎస్, ఇన్ఫోసిస్.. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీల ఆదాయాల వెల్లడి సీజన్‌ను ప్రారంభించనున్నాయి. ఈ రెండు కంపెనీల జూన్ త్రైమాసిక ఫలితాలు వచ్చే వారంలో వెలువడనున్నాయి. వాణిజ్య సంబంధిత పరిణామాలపైనా మదుపరుల దృష్టి కేంద్రీకృతమయి ఉంటుందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. ‘వాణిజ్య యుద్ధాలు అనేవి ఇప్పుడు ఆందోళనను పెంచుతున్న అంశాలు. ఈ అంశం ఎటువైపు దారితీస్తుందో అనేది తేలడానికి కొంత సమయం పడుతుంది’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన క్యాపిటల్ మార్కెట్ స్ట్రాటజి విభాగం అధిపతి వీకే శర్మ పేర్కొన్నారు. ‘మదుపరులు వినియోగ వస్తువుల ధరల ఆధారిత (సీపీఐ) ద్రవ్యోల్బణం (చిల్లర ద్రవ్యోల్బణం), దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ గణాంకాలపై కూడా వచ్చే వారం మదుపరులు దృష్టి కేంద్రీకరిస్తారని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ విభాగం అధిపతి వినోద్ నాయర్ పేర్కొన్నారు. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 234.38 పాయింట్లు (0.66 శాతం) పుంజుకొని 35,657.86 పాయింట్ల వద్ద ముగిసింది. ‘ఎంతో ముఖ్యమయిన చాలా సంఘటనలు జరగాల్సి ఉన్నాయి. ద్రవ్యోల్బణం, ఐఐపీ గణాంకాలపై మదుపరుల దృష్టి కేంద్రీకృతమయి ఉంటుంది’ అని ఎపిక్ రీసెర్చ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ముస్త్ఫా నదీమ్ పేర్కొన్నారు.