బిజినెస్

రూ. 15,354 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 8: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) నుంచి రుణాలు తీసుకొని ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన సంస్థలు బకాయి ఉన్న మొత్తం 2018 జూన్ 30 నాటికి అంతకు ముందు నెలతో పోలిస్తే 0.87 శాతం తగ్గుదలతో రూ. 15,354.52 కోట్లకు చేరింది. బ్యాంకుకు సంబంధించిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. పీఎన్‌బీ నుంచి రూ. 25లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ మొత్తంలో రుణం తీసుకుని, చెల్లించని వారిని ఉద్దేశపూర్వక ఎగవేతదారులు (బిగ్ విల్‌ఫుల్ డిఫాల్టర్లు)గా ఆ బ్యాంకు పేర్కొంటోంది. ఇలాంటి రుణ గ్రహీతలు 2018 మే నెల చివరి నాటికి బకాయిపడిన మొత్తం రూ. 15,490 కోట్లు. 2018 మార్చితో పూర్తయిన ఆర్థిక సంవత్సరం బ్యాంక్ బ్యాలెన్స్ షీట్‌లో బిగ్ విల్‌ఫుల్ డిఫాల్టర్లు బకాయి పడిన మొత్తం రూ. 15,171.91 కోట్లు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో రూ. 1,324.80 కోట్ల లాభం ఆర్జించిన పీఎన్‌బీ 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ. 12,282.82 కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. పీఎన్‌బీ నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన ప్రధాన సంస్థలు, అవి బకాయిపడిన మొత్తాలు ఇలా ఉన్నాయి. కుడోస్ కెమి లిమిటెడ్ (రూ. 1,301.82 కోట్లు), కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ (రూ. 597.44 కోట్లు), జాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (రూ. 410.96 కోట్లు), వీఎంసీ సిస్టమ్స్ (రూ. 296.08 కోట్లు), ఎంబీఎస్ జెస్వెల్లర్స్ (రూ. 266.17 కోట్లు), తులసి ఎక్స్‌ట్రూజన్ (రూ. 175.41 కోట్లు) అరవింద్ రెమెడీస్ (రూ. 158.16 కోట్లు) బిగ్ విల్‌ఫుల్ డిఫాల్టర్లుగా ఉన్నాయి. ఈ సంస్థలన్నీ ఇతర బ్యాంకులతో కలిసి కన్సార్టియంలో ఉన్న పీఎన్‌బీ నుంచి రుణాలు తీసుకున్నాయి. అలా కాకుండా నేరుగా పీఎన్‌బీ నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన సంస్థలలో విన్‌సమ్ డైమండ్స్ అండ్ జెవెలరీ, ఫర్‌ఎవర్ ప్రెసియస్ జెవెలరీ అండ్ డైమండ్స్, జూమ్ డెవలపర్స్, ఆపిల్ ఇండస్ట్రీస్, మహువా మీడియా ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ సిద్బలి ఇస్పాత్ వంటివి ఉన్నాయి.