బిజినెస్

277 పాయింట్లు మెరుగుపడిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 9: జాతీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లలో సోమవారం ఎంతో ప్రగతి కనిపించింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 277 పాయింట్లు మెరుగుపడింది. గత ఐదు నెలల కాలంలో ఇదే అత్యంత పెరుగుదల కావడంతో వాణిజ్యవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సోమవారం సెనె్సక్స్ 35,934.72 అత్యధిక పాయింట్లతో ముగిసింది. ముఖ్యంగా ఎనర్జీ, మూలధన వస్తువులు (కేపిటల్ గూడ్స్), పవర్, బ్యాంకింగ్ షేర్లు ప్రపంచ మార్కెట్‌లో పుంజుకున్నాయి. అమెరికా డాలర్‌తో సహా రూపాయి మారకద్రవ్యం మునుపటి కంటే మరింత బలపడడంతో మదుపరులు తమ వాణిజ్య కార్యకలాపాలకు అనువైన సెంటిమెంట్లకు అనుగుణంగా లాభాలు కలిగిన సంస్థల్లోకి పెట్టుబడులు పెట్టేందుకు తీవ్రంగా పోటీ పడ్డారు. 30 షేర్ ముఖ విలువ కలిగిన బీఎస్‌ఈ సెనె్సక్స్ రెండోరోజు కూడా పరుగులు తీసి 276.86 పాయింట్లు లేదా 0.78 శాతంతో 35,934.72 వద్ద నిలదొక్కుకుంది. ఈ ఏడాది జనవరి 31 తర్వాత 35.965.02తో ముగియడం ఇదే తొలిసారి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజి నిఫ్టీ 10,800 వద్ద 80.25 పాయింట్లతో మెరుగుపడింది. గత నెలలో ఇది 10,856.70తో ముగిసింది. ఇండెక్స్ హెవీవెయిట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.96 శాతం, ఐటీ మేజర్ ఇన్‌ఫోసిస్ 1.14 శాతం రెండో సైతం లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు ఎక్కువ శాతంతో మెరుగయ్యాయి. త్రైమాసికంలో వచ్చిన ఫలితాలకు అనుగుణంగా మదుపరులు ఐటీ, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి రంగాలవైపు దృష్టి సారించనున్నారు. ఇదిలావుండగా, టాటా గ్రూప్ కంపెనీల షేర్లు బాగా లబ్ధి పొందాయి. టాటా మోటార్స్ 0.81 శాతం 273.35, టాటా మోటార్స్ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) 0.9 శాతం మెరుగుపడ్డాయి. టాటా స్టీల్ లిమిటెడ్ 0.49 శాతం, టాటా పవర్ 2.09, టాటా కెమికల్స్ 1.65 శాతం, టాటా కాఫీ 0.68 శాతంతో మెరిశాయి. సెనె్సక్స్‌లో వేదాంత ఎక్కువగా లాభపడింది. ఈ కంపెనీ షేరు 3.14 శాతం మెరుగుపడింది. ఆసియన్ పెయింట్స్ 3.11 శాతం, ఎస్ బ్యాంక్ 2.70 శాతం, సన్ ఫార్మా 1.97 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.83 శాతం, పవర్ గ్రిడ్ 1.77 శాతం, ఎల్ అండ్ టీ 1.57 శాతం, ఎస్‌బీఐ 1.51 శాతం, ఓఎన్‌జీసీ 1.12 శాతం, కొటాక్ బ్యాంక్ 1.05 శాతం, విప్రో 0.95 శాతం, ఎం అండ్ ఎం 0.86 శాతం, ఆదానీ పోర్ట్స్ 0.86 శాతం, టాటా మోటార్స్ 0.81 శాతం, ఐటీసీ 0.72 శాతం, ఎహెచ్‌యూఎల్ 0.72 శాతం, మారుతీ సుజుకీ 0.69 శాతం, ఎన్టీపీసీ 0.57 శాతం, ఐసీసీఐ బ్యాంక్ 0.46 శాతం మెరుగుపడ్డాయి. కాగా, హెచ్‌డీఎస్‌సీ షేరు 0.32 శాతం పడిపోయింది. భారతీ ఎయిర్‌టెల్ 0.22 శాతం, ఇండస్ ఇండ్ బ్యాంక్ 0.22 శాతం, కోల్ ఇండియా 0.11 శాతం, బజాజ్ ఆటో 0.04 శాతం నష్టపోయాయి. బీఎస్‌ఈ స్మాల్ కేప్ ఇండెక్స్‌లో కొంతవరకు మెరుగుదల కనిపించింది. ఎనర్జీ 1.46 శాతం, కేపిటల్ గూడ్స్ 1.46 శాతం, పవర్ 1.32 శాతం, ఇన్‌ఫ్రాస్టక్చర్ 1.29 శాతం, మెటల్ 1.24 శాతం, హెల్త్‌కేర్ 1.16 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 1.12 శాతం మెరుగుపడ్డాయి. ఆసియా రీజియన్‌లో హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ 1.32 శాతం, షాంఘ్‌హై 2.47, జపాన్‌కు చెందిన నిక్కీ 1.21తో ముగిశాయి.