బిజినెస్

సింగిల్ జీఎస్‌టీ శ్లాబ్ రేటు వాదన హాస్యాస్పదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, జూలై 9: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వస్తు, సర్వీసు ట్యాక్స్ (జీఎస్‌టీ)లో సింగిల్ శ్లాబ్ రేటు ఉండాలంటూ కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న వాదన హాస్యాస్పదమని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఇపుడున్న నాలుగు శ్లాబుల విధానాన్ని పలు పార్టీలు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో రానున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తమను అధికారంలోకి తీసుకువస్తే జీఎస్‌టీలో సింగిల్ శ్లాబ్ రేటు విధానాన్ని తీసుకువస్తామని హామీ ఇవ్వడం ఎంతవరకు సబబని ఆయన వ్యాఖ్యానించారు. ‘సింగిల్ శ్లాబ్ రేటు విధానం కావాలని సూచించడం హాస్యాస్పదం. ఈ విధానం అమలైతే ఇటు పేద, అటు మధ్య తరగతి ప్రజలు వినియోగించే సాధారణ వస్తువులైన ఉప్పు, చక్కెర, దుస్తులు వంటివాటిపై 18 శాతం టాక్స్ పడుతుంది’ అని మంత్రి ఇక్కడ జరిగిన ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం 18 శాతం సింగిల్ జీఎస్‌టీ శ్లాబ్ విధానాన్ని ప్రతిపాదించిందని, అయితే, ఆ విధానాన్ని అమల్లోకి రాని విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న జీఎస్‌టీలో సింగిల్ శ్లాబ్ విధానం ద్వారా మెర్సిడెస్ బెంజ్, విమానాలు ఏ విధంగా చౌకగా లభ్యమవుతాయని ఆయన ఎద్దేవా చేశారు. ఈ విషయంలో అప్పటి ప్రభుత్వ ఆలోచనా విధానం అసంబద్ధమని ఆయ న అన్నారు. గత ఏడాది జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్‌టీ విధానం వల్ల మొత్తం 1200 వస్తువుల్లో దాదాపు 328 వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టాయని ఆయన పేర్కొన్నారు. దేశంలో టాక్స్ చెల్లించేందుకు అర్హత కలిగినవారంతా ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తే జీఎస్‌టీ కిందకు వచ్చిన పలు వస్తువుల ధరలు మరింత తగ్గే అవకాశం లేకపోలేదని అన్నారు.