బిజినెస్

ఫోన్ల తయారీలో 2వ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నొయిడా (యూపీ), జూలై 9: రానున్న రోజుల్లో ఫోన్ల తయారీ రంగంలో ప్రపంచంలోనే రెండవ స్థానంలో నిలబడతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా గత రెండేళ్లలో దేశంలో ఫోన్లు తయారు చేసే ఫ్యాక్టరీలు 120కి పెరిగాయని ఆయన అన్నారు. ఢిల్లీ శివారులో సోమవారం ప్రపంచంలోనే అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని సుదీర్ఘంగా ప్రసంగించారు. మొబైల్ ఫోన్ల తయారీ కర్మాగారాల వల్ల దేశంలో నాలుగు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని అన్నారు. ఇలాంటి భారీ పరిశ్రమల ఏర్పాటుకు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు తద్వారా ఆర్థిక వ్యవహారాలు, వ్యాపార రంగంలో మరింత అభివృద్ధికి దక్షిణ కొరియా వంటి దేశాలు ముందుకు రావడం అభినందనీయమని ప్రధాని అన్నారు. భారత ఆర్థిక పరిస్థితులు క్రమేణా వేగం పుంజుకుంటున్నాయని, ఇది గర్వించదగ్గ విషయమని అన్నారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశ ఆర్థిక విధానాన్ని మరింత పెంపొందించుకోవడం ఒక్కటే కాదని, ఇరుపొరుగు దేశాలతో సహృద్భావ వాతావరణాన్ని కలిగి ఉండడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.
భారతదేశ జనాభాలో దాదాపు 40 కోట్ల మంది స్మార్ట్ఫోన్లను వినియోగిస్తున్నారని, 32 కోట్ల మంది ఇంటర్నెట్ వాడుతున్నారని ప్రధాని అన్నారు. దేశంలో రెండేళ్ల క్రితం వరకు కేవలం రెండు ఫోన్ల తయారీ కర్మాగారాలు ఉంటే ఇపుడు 120కి పెరిగాయంటే అందుకు కారణం ఆయా కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి ఫలాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సాంకేతిక విప్లవం వల్ల మొబైల్ ఫోన్ల ధరలకు అతి తక్కువకే దొరకడం, తక్కువ రేటుతో హైస్పీడ్ ఇంటర్నెట్, ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ లభిస్తుండడంతో మన దేశంలో లక్షకు పైగా గ్రామ పంచాయతీల్లో ఫోన్ల వాడకం పెరిగిందని ప్రధాని అన్నారు. దక్షిణ కొరియాలోని ప్రసిద్ధ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఆధ్వర్యంలో నొయిడాలో ప్రారంభించిన అతి పెద్ద ఫోన్ల తయారీ కర్మాగారంలో 5వేల కోట్ల విలువైన 120 మిలియన్ స్మార్ట్ఫోన్లు ప్రతి సంవత్సరం తయారుకానున్నాయని ప్రధాని తెలిపారు. కొరియా వస్తువులు మన దేశంలోని ప్రతి మధ్య తరగతి కుటుంబాల్లో రాజ్యమేలుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొరియా అధ్యక్షుడు మూన్ జై మాట్లాడుతూ భారత్‌లో తాము నెలకొల్పే శాంసంగ్ ఫ్యాక్టరీ ద్వారా రెండువేల మందికి ఉద్యోగావకాశాలు దక్కుతాయని అన్నారు. తమ దేశం కూడా ఇక్కడ అతి పెద్ద కర్మాగారం నెలకొల్పేందుకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ కమర్షియల్ టెక్నాలజీ, హార్డ్‌వేర్ రంగాల్లో కొరియా నిపుణులు తమ సత్తా చాటాలని అభిలషించారు.