బిజినెస్

వ్యాపార ధోరణికి మేం వ్యతిరేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం: శ్రీ పద్మనాభస్వామి ఆలయానికి సంబంధించిన వెలకట్టలేని అతి విలువైన సంపదను హైటెక్ మ్యూజియంలో ప్రదర్శించడం ద్వారా వ్యాపార ధోరణికి పాల్పడలేమని, ఇందుకు తాము పూర్తిగా వ్యతిరేకమని ట్రావన్‌కోర్ రాయల్ కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఆలయంలోని అతి విలువైన సంపదను బహిరంగంగా ప్రదర్శించాలన్న అంశంపై వస్తున్న ప్రతిపాదనను తాము అంగీకరించేది లేదని వారు తెలిపారు. పద్మనాభస్వామి ఆలయ సంపదను తాము కొన్ని దశాబ్దాలుగా అంకితభావంతో కాపాడుతున్నామని వారు అన్నారు. అయితే, ఎంపిక చేసిన, అరుదైన ఆభరణాలు కొన్నింటిని అతి భద్రత కలిగిన ఆలయంలోని వ్యాలెట్‌లలో ఉన్నాయని, వాటి త్రీడీ ఫొటోలను ప్రదర్శించడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వారు స్పష్టం చేశారు. అయితే, ఈ చర్యకు ఉపక్రమించాలనుకున్నా తమ ఆలయ తాంత్రి (ప్రధాన పూజారి)తోపాటు మరికొంతమంది ప్రజల అంగీకారం తప్పనిసరి ఉంటేనే సాధ్యమవుతుందని ట్రావన్‌కోర్ రాయల్ కుటుంబానికి చెందిన ఆదిత్య వర్మ అనే సభ్యుడు పేర్కొన్నారు. ఆలయ సంపదను మ్యూజియంలో ప్రదర్శించాలన్న ప్రతిపాదనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను సంప్రదించడంతో, ఆలయ కార్యకలాపాలు, సంపద విషయం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని గుర్తు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఆలయ సంపదను మ్యూజియంలో ప్రదర్శించాలన్న నిర్ణయంపై కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామే తప్ప, ఏ ఒక్కరూ దీనిపై తుది నిర్ణయం తీసుకోలేరని ఆయన స్పష్టం చేశారు. ఇదిలావుండగా, ఎంతో చరిత్ర కలిగిన పద్మనాభస్వామి ఆలయంలోని ఆరు సెల్లార్లలో ఐదు సెల్లార్లను కొన్ని దశాబ్దాల నుండి మూసివేశారని, వాటిని తెరిపించాలంటూ 2011లో సుప్రీంకోర్టులో ఒక ప్రైవేటు పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఈ గొప్పదైన ఆలయం సుప్రీంకోర్టు అడిషనల్ జిల్లా జడ్జి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఆధ్వర్యంలో నడుస్తోంది.