బిజినెస్

గట్టి పోటీనిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 10: ఐడియా సెల్యులార్‌తో విలీనం తరువాత భారత మార్కెట్‌లో తమ సంస్థ గట్టి పోటీదారుగా నిలుస్తుందని బ్రిటన్‌కు చెందిన టెలికం దిగ్గజం వొడాఫోన్ మంగళవారం పేర్కొంది. రిలయన్స్ జియో కొత్తగా మార్కెట్‌లోకి ప్రవేశించిన తరువాత టెలికం రంగంలో టారిఫ్ వార్ మొదలయి, పలు సంస్థలు ఆర్థికంగా ఎడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. వొడాఫోన్, ఐడియా సెల్యులార్ సంస్థల విలీన లేఖ తమకు అందడం పట్ల సంతోషంగా ఉందని విలీనం తరువాత వొడాఫోన్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈవో)గా బాధ్యతలు నిర్వహించనున్న నిక్ రీడ్ ఒక వార్తాసంస్థ ప్రతినిధితో అన్నారు. వొడాఫోన్- ఐడియా సెల్యులార్ విలీనం ఆమోదం పొందిన తరువాత టెలికం మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులతో నిక్ తదితరులు మంగళవారం ఇక్కడ భేటీ అయ్యారు. కమ్యూనికేషన్స్ మంత్రి మనోజ్ సిన్హా, టెలికం శాఖ కార్యదర్శి అరుణా సుందరరాజన్‌ను వొడాఫోన్‌కు చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం ఇక్కడ కలిసింది. వొడాఫోన్- ఐడియా సెల్యులార్‌ల విలీనం పూర్తయిందని రీడ్ ఈ సందర్భంగా ధ్రువీకరించారు. ఇందుకు సంబంధించిన లేఖ తమకు అందిందని వెల్లడించారు.