బిజినెస్

మళ్లీ 36వేల స్థాయికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 10: ప్రోత్సాహకరంగా ఉన్న కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఆదాయాల దన్నుతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు మంగళవారం బాగా బలపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వంటి వివిధ షేర్ల కొనుగోలుకు మదుపరులు జోరుగా పూనుకోవడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 305 పాయింట్లు పుంజుకొని అయిదు నెలల గరిష్ఠ స్థాయిలో 36,239.62 పాయింట్ల వద్ద ముగిసింది. అదే రీతిలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 94 పాయింట్లు పెరిగి 10,947 పాయింట్ల వద్ద స్థిరపడింది. దేశీయ సంస్థాగత మదుపరుల (డీఐఐల) నిరంతరాయ కొనుగోళ్లతో పాటు ఇప్పటి వరకు వెలువడిన కార్పొరేట్ కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉండటం మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేసిందని బ్రోకర్లు చెప్పారు. బీఎస్‌ఈ సెనె్సక్స్ మంగళవారం ఇంట్రా-డేలో 36,274.33 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 304.90 పాయింట్ల (0.85 శాతం) పైన 36,239.62 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సూచీ మూడు సెషన్లలో కలిసి 665.07 పాయింట్లు పుంజుకుంది. ఈ సంవత్సరం జనవరి 29న ఆల్-టైమ్ హై 36,283.25 పాయింట్ల వద్ద ముగిసిన సెనె్సక్స్ మంగళవారం దానికన్నా కాస్త దిగువన స్థిరపడింది. అదే బాటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం క్రితం ముగింపుతో పోలిస్తే 94.35 పాయింట్లు (0.87 శాతం) పెరిగి 10,947.25 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రా-డేలో ఈ సూచీ 10,956.90- 10,876.65 పాయింట్ల మధ్య కదలాడింది. సెనె్సక్స్, నిఫ్టీ రెండూ కూడా మంగళవారం సెషన్ అంతా వరుసగా వాటి కీలక స్థాయిలయిన 36,000, 10,900 పాయింట్ల స్థాయికి పైనే కదలాడాయి. చాలా రోజులు ఊగిసలాటలో కొట్టుమిట్టాడిన దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇప్పుడు మదుపరులలో బాగా నెలకొన్న ఆశావాద ధోరణిని ఇది ప్రతిబింబిస్తోంది. ఇదిలా ఉండగా, డీఐఐలు సోమవారం నికరంగా రూ. 740.39 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 569.91 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
సెనె్సక్స్ ప్యాక్‌లోని రిలయన్స్, యెస్ బ్యాంక్, విప్రో, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, టాటా స్టీల్ సంస్థలు మంగళవారం ప్రధానంగా లాభపడ్డాయి. వీటి షేర్ల విలువ 2.03- 3.05 శాతం మధ్య పెరిగింది. మరోవైపు, హిందుస్తాన్ యూనిలీవర్, టీసీఎస్, సన్ ఫార్మా, కోటక్ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హీరోమోటోకార్ప్ షేర్లు 0.45- 1.19 శాతం మధ్య నష్టపోయాయి.