బిజినెస్

తూర్పు కనుమల్లో రంగురాళ్ల నిధి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 3: విశాఖ జిల్లాలోని తూర్పు కనుమల్లో రంగురాళ్ల నిధి ఉన్నట్లుగా ఆంధ్ర విశ్వవిద్యాలయం నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడైంది. అత్యంత విలువైన అలెగ్జాండ్రైట్ రకం రంగురాయి నిల్వలను దాదాపు 51.26 టన్నుల మేరకు గుర్తించారు. ఏజన్సీలోని కొన్ని ప్రాంతాల్లో అనధికారికంగా రంగురాళ్ల తవ్వకాలు జరగడం, కొంతమంది వ్యాపారులు ఈ వ్యవహారాల్లో పట్టుబడటం వంటి ఘటనల నేపథ్యంలో ఈ అధ్యయనం ప్రాధాన్యత సంతరించుకుంది. తొలిసారిగా విశాఖ జిల్లా ఏజన్సీలో రంగురాళ్ల నిల్వలపై అధ్యయనం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం జియాలజీ విభాగం మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ డివిజన్‌కు చెందిన కొంతమంది రంగురాళ్ల ఎగుమతిదారుడైన ప్రొఫెసర్ సి కాశీపతి నేతృత్వంలో రంగురాళ్ల నిల్వలపై పరిశోధనలు చేశారు. రంగురాళ్లు ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న ప్రాంతాల్లో భూభౌగోళిక పరిస్థితులు, క్షేత్ర పరిశీలన, ఆయా ప్రాంతాల్లో నెలకొన్న నేల తదితర అంశాలను విశే్లషించారు. జియోలాజికల్ మ్యాపింగ్, ఫిజయోగ్రాఫిక్ కాంటూరింగ్, తవ్వకాలు, డ్రిల్లింగ్ తదితర విధానాల ద్వారా నమూనాలను సేకరించి పరీక్షించారు. ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ పరీక్షలను కూడా చేపట్టడం ద్వారా నిల్వలను కచ్చితంగా అంచనా వేసే ప్రయత్నం చేశారు. ఈ విధంగా సేకరించిన నమూనాలను కేటగిరిల వారీగా విభజించి సంబంధిత ప్రయోగశాలల్లో పరీక్షలు చేశారు. సేకరించిన నమూనాల్లో రంగురాళ్ల శాతం, మలినాల శాతాన్ని కూడా నిర్ధారించారు. రంగురాళ్లు ఏయే ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు కూడా అంచనా వేశారు. ఈ పరిశోధన వివరాలను కెనడియన్ జర్నల్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ సైన్సస్‌లో ప్రచురించారు. ఈ సందర్భంగా ఆచార్య కాశీపతి మాట్లాడుతూ తూర్పు కనుమల మొబైల్ బెల్ట్ (ఇజిఎంబి)గా వ్యవహరించే ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో విలువైన రంగురాళ్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అలెగ్జాండ్రైట్, క్రైసోబెరైల్, క్రైసోబెరైల్ క్యాట్స్ ఐ, అక్వామెరైన్, పుష్యరాగం, కెంపు, చంద్రకాంత, పచ్చ తదితర రకాల రంగురాళ్లు ఉన్నట్లు పరిశోధనలో వెల్లడైందన్నారు. అలెగ్జాండ్రైట్ అనే అత్యంత విలువైన రంగురాయి ఇతర రంగురాళ్లతో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతాల్లో రూపొందుతుందని తెలిపారు. ఇది క్రైసోబెరైల్ తరహాలో కనిపించినప్పటికీ అలెగ్జాండ్రైట్‌లో క్రోమియం ఎక్కువగా ఉంటుందని, దీంతో ఆకర్షణీయమైన పచ్చరంగుతో మెరుస్తుందని వివరించారు. బహిరంగ మార్కెట్‌లో ఒక క్యారెట్ అలెగ్జాండ్రైట్ దాదాపు లక్ష రూపాయల విలువ పలుకుతుంది. ఈ రాయి నిల్వలు దాదాపు 51.26 టన్నుల మేరకు ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలిందన్నారు. కాగా, ఈ ప్రాంతాల్లో అక్రమ రంగురాళ్ల మైనింగ్‌ను నిరోధించేందుకు జెమ్‌స్టోన్ ప్రావిన్స్ వంటిది ఏర్పాటు చేస్తే మేలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి అక్రమ తవ్వకాలను నిరోధించేందుకు రెవెన్యూ, పోలీస్, అటవీ, మైనింగ్, జియాలజీ తదతర శాఖలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. అయినప్పటికీ అక్రమ మైనింగ్ వల్ల పర్యావరణం, అడవులు ప్రభావితం అవుతునే ఉన్నాయ. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పర్యావరణానికి హాని కలగకుండా ఈ రంగురాళ్ల మైనింగ్‌ను చేపడితే పారిశ్రామికాభివృద్ధి ఖాయమని, ముఖ్యంగా రంగురాళ్ల ఆధారిత పరిశ్రమల పురోగతి, తద్వారా ఉపాధి లభించే వీలుంటుందని నిపుణు లు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వానికి కూడా ఆదా యం లభిస్తుందని గుర్తుచేస్తున్నారు.