బిజినెస్

వెయ్యికోట్లతో శ్రీసిటీలో మరో భారీ పరిశ్రమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యవేడు, జూలై 11: జపాన్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక సంస్థ టోరే ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నూతన ఉత్పత్తి కేంద్రం నెల్లూరు, చిత్తూరు జిల్లా సరిహద్దులోని శ్రీసిటీ సెజ్‌లో ఏర్పాటుకు నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యాక్టరీ నిర్మాణానికి బుధవారం శ్రీసిటీలో భూమిపూజ జరిగింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఎన్.అమరనాథరెడ్డి శిలాఫలకాన్ని ఆవిష్కరించి లాంఛనంగా నిర్మాణాన్ని ప్రారంభించారు. చెన్నైలోని జపాన్ కాన్సూల్ జనరల్ ఉచియమా, టోరే ఇండస్ట్రీస్ సీఈఓ అకిహిరోనిక్కకీ, థోరే ఇండియా మెనేజింగ్ డైరెక్టర్ షిఏఖజుసునగ, సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యశాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్, ఏపీఈడీబీ సీఈఓ కృష్ణకిషోర్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అమలుచేస్తున్న సులభతర విధానం వలన పలు పరిశ్రమలు శ్రీసిటీకీ రావడానికి ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. టోరే ఇండస్ట్రీ సీఈఓ అఖిహిరోనిక్కకీ మాట్లాడుతూ టోరే ఇండస్ట్రీస్ తరఫున రెండు ఉత్పత్తి కేంద్రాలు ఉంటాయి. ఒకదానిలో వ్యక్తిగత పరిశుభ్రతకు వాడే డైపర్‌ల తయారీకి అవసరమైన పాలిప్రొఫిలిన్ ఫైబర్ వస్త్రం తయారవుతుంది. ఇది 2020 నాటికల్లా సిద్ధం అవుతుంది. 2019 సెప్టెంబర్ నాటికి సిద్దమయ్యే రెండవ ఉత్పత్తి కేంద్రంలో ఆటోమొబైల్ రంగంలో ఉపయోగించే విద్యుత్ ఉపకరణాలకు అవసరమైన ప్లాస్టిక్ రెజీన్ పదార్థాన్ని తయారుచేస్తారు. తొలిదశలో ఈ కంపెనీ వలన సుమారు 130మందికి ప్రత్యక్షంగా, మరో 520మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.