బిజినెస్

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తొలి త్రైమాసికంలో అంచనాలను మించి ఆదాయాన్ని ఆర్జించడంతో ఆ కంపెనీ షేర్ల విలువ బుధవారం 5.47 శాతం పుంజుకొని జీవనకాల గరిష్ఠ స్థాయి అయిన రూ. 1,979.60లకు చేరింది. దేశంలోనే అతి పెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతి చేసే సంస్థ అయిన టీసీఎస్ మంగళవారం వెలువరించిన తొలి త్రైమాసిక ఫలితాలలో తన నికర లాభాన్ని 23.4 శాతం పెంచుకుంది.
టీసీఎస్ నేతృత్వంలో పలు షేర్ల విలువ పెరగడంతో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ బుధవారం 26 పాయింట్లు పుంజుకొని 36,265.93 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 1.05 పాయింట్లు పెరిగి 10,948.30 పాయింట్ల వద్ద ముగిసింది. మార్కెట్ కీలక సూచీలు బుధవారం లాభాలు, నష్టాల మధ్య ఊగిసలాడినప్పటికీ చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ పరిస్థితులు తీవ్రం అవుతుండటంతో మదపరులు బుధవారం అప్రమత్తంగా వ్యవహరించారు.
బుధవారం పటిష్టమయిన స్థాయి వద్ద ప్రారంభమయిన సెనె్సక్స్ మదుపరుల నుంచి అందిన కొనుగోళ్ల మద్దతుతో మరింత పైకి ఎగబాకుతూ ఇంట్రా-డేలో 36,362.30 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. అయితే, తరువాత మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడంతో ఒక దశలో 36,169.70 పాయింట్ల కనిష్ట స్థాయికి చేరింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 26.31 పాయింట్ల (0.07 శాతం) ఎగువన 36,265.93 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 1.05 పాయింట్ల (0.01 శాతం) ఎగువన 10,948.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. అంతకు ముందు ఈ సూచీ 10,976.65- 10,923 పాయింట్ల మధ్య కదలాడింది. ఇదిలా ఉండగా దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) మంగళవారం నికరంగా రూ. 293.96 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 20.73 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
బుధవారం నిఫ్టీ ప్యాక్‌లోని అత్యధికంగా లాభపడిన సంస్థలలో టీసీఎస్, భారతి ఇన్‌ఫ్రాటెల్, బజాజ్ ఆటో, హిందుస్తాన్ యూనిలీవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మరోవైపు, 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు గాను 11 బ్యాంకుల షేర్ల విలువ పడిపోయింది. ఐటీ షేర్లతో పాటు ఎఫ్‌ఎంసీజీ, స్థిరాస్తి రంగాల షేర్లు లాభపడ్డాయి.
ప్రపంచ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. లోహాల ధరలు ఏడాది కనిష్ట స్థాయికి పడిపోయాయి. షాంఘై మార్కెట్లు తీవ్రంగా పడిపోయాయి. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ మార్కెట్లు సుమారు రెండు శాతం నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే యువాన్ విలువ 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది.