బిజినెస్

మందగించిన పారిశ్రామికోత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 12: దేశంలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు మే నెలలో ఏడు నెలల కనిష్ట స్థాయి అయిన 3.2 శాతానికి పడిపోయింది. మాన్యుఫాక్చరింగ్, పవర్ సెక్టార్ల పనితీరు బాగా లేకపోవడంతో పాటు ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్‌ఎంసీజీ) ఉత్పత్తి వృద్ధి ఈ కాలంలో బాగా పడిపోవడం వంటి అంశాలు ప్రధానంగా పారిశ్రామికోత్పత్తి వృద్ధి పడిపోవడానికి దారితీశాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) గురువారం వెల్లడించిన గణాంకాల ప్రకారం పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) ఆధారంగా ఏప్రిల్ నెలలో పారిశ్రామికోత్పత్తి వృద్ధిని అంతకు ముందు అంచనా వేసిన 4.9 శాతానికి బదులు 4.8 శాతానికి సవరించారు. పారిశ్రామికోత్పత్తి మే నెలలో 2.9 శాతం వృద్ధి సాధించింది. అంతకన్నా ముందు 2017 అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి అంతకన్నా తక్కువగా 1.8 శాతమే నమోదయింది. ఈ సంవత్సరం ఏప్రిల్-మే నెలల్లో ఐఐపీ 4.4 శాతం వృద్ధి చెందింది. అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో ఇది 3.1 శాతం నమోదయింది. ఇండెక్స్‌లో 77.63 శాతంగా ఉన్న మాన్యుఫాక్చరింగ్ రంగం మే నెలలో కేవలం 2.8 శాతమే వృద్ధి చెందింది. అంటే నిరుడు మే నెలలో నమోదయిన 2.6 శాతంతో పోలిస్తే నామమాత్రంగానే పెరిగింది. విద్యుత్ ఉత్పత్తి వృద్ధి రేటు మే నెలలో ఘోరంగా 4.2 శాతానికి పడిపోయింది. నిరుడు మే నెలలో ఇది 8.3 శాతం వృద్ధి చెందింది. అయితే, మైనింగ్ సెక్టార్ ఉత్పత్తి వృద్ధి రేటు మే నెలలో ఆకర్షణీయమయిన రీతిలో 5.7 శాతం నమోదయింది. క్రితం సంవత్సరం మే నెలలో ఇది కేవలం 0.3 శాతమే వృద్ధి చెందింది. ఎఫ్‌ఎంసీజీ సెక్టార్ పనితీరు ఘోరంగా దెబ్బతిన్నది. ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తి మే నెలలో 2.6 శాతం పడిపోయింది. నిరుడు మే నెలలో ఇది 9.7 శాతం నమోదయింది.