బిజినెస్

పెట్టుబడులు, వాణిజ్యంపై దృష్టి సారించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెల్‌బోర్న్, జూలై 13: భారత్, ఆస్ట్రేలియా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు ఆశించిన రీతిలో బలోపేతంగా లేవని, ఈ దిశగా ఇరుదేశాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా ప్రభుత్వం వ్యూహాత్మక ఆర్థిక విధానాలపై విడుదల చేసిన విధానపత్రంలో పేర్కొంది. ఈ రెండు దేశాలు అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు విశేష ప్రయత్నాలు చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సమగ్ర ఆర్థిక, సహకార ఒప్పందం (సీఈసీఏ) ఖరారుకు కృషి జరుగుతోంది. కాని దీని కోసం ఇరుదేశాలు పెద్దగా చేస్తున్నదేమీ లేదు. భారత్ ఆర్థిక వ్యూహాత్మక విధానం 2035 అనే నివేదికలో ఈ అంశాలను ఆస్ట్రేలియా వెల్లడించింది. ఈ నివేదికను భారత్‌లో ఆస్ట్రేలియా హై కమిషనర్‌గా పనిచేసిన పీటర్ వర్గీస్ తయారు చేశారు. భారత్‌తో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య సాధనకు ఆస్ట్రేలియా వడివడిగా అడుగులు వేయాలని ఆయన కోరారు. 2011లో ఇరు దేశాల మధ్య సీఈసీఏ సాధనకు ప్రయత్నాలు ప్రారంభమైనా, ఇప్పటకీ నత్తనడకన సాగుతున్నాయి.
వాణిజ్యం, పెట్టుబడులు పెంచుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఆ దిశగా మంతనాలు జరిపారు. కాని వస్తువులు, సేవల విషయంలో ఇరు దేశాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం ఖరారు కాలేదు. ఆస్ట్రేలియా భారత్‌తో ఒప్పందం ఖరారుకు అజెండాలో 90 అంశాలను చేర్చింది. ఇందులో కొన్నింటినైనా సాధించేందుకు ఆస్ట్రేలియా కృషి చేయాలని పీటర్ వర్గీస్ సూచించారు. ఇరుదేశాల మధ్య ప్రాంతీయ వాణిజ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్యంపై చర్చలు 2012లో ప్రారంభమయ్యాయి. ఏసియాన్ శిఖరాగ్ర సదస్సులో ఈ చర్చలు ప్రారంభమైనా ఇంతవరకు కొలిక్కి రాలేదు. భారత్ ఎక్కువగా విదేశీపెట్టుబడులపై దృష్టిని సారించిందని నివేదికలో పేర్కొన్నారు. ఆస్ట్రేలియాలో వాణిజ్యవేత్తలు భారత్‌కు ఎగుమతులపై ఆసక్తితో ఉన్నారు. భారత్ పెట్టుబడులపై విశాల దృక్పథంతో ఉందని, ఈ అవకాశాన్ని ఆస్ట్రేలియా ఉపయోగించుకోవాలని పీటర్ వర్గీస్ సిఫార్సు చేశారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ దిశగా చొరవ తీసుకోవాలన్నారు. వాణిజ్యాభివృద్ధికి ఉపయోగపడే సానుకూలమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆస్ట్రేలియా పాలకులను కోరారు. ఒక రెగ్యులేటరీ విధానం ఉంటే బాగుంటుందన్నారు. డిజిటల్ వాణిజ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో భారత్‌లో వాణిజ్య ఒప్పందాలు ఆస్ట్రేలియాకు లాభిస్తాయన్నారు.