బిజినెస్

బ్రిటన్‌ను వెనక్కి నెడుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 13: భారత ఆర్థిక వ్యవస్థ వేసిన అంచనా ప్రకారం వృద్ధి చెందితే వచ్చే సంవత్సరం బ్రిటన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే అయిదో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీమా వ్యక్తం చేశారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరలు, ప్రపంచ వాణిజ్య యుద్ధం అంశాలు దూసుకెళ్తున్న భారత ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘వేసిన అంచనా ప్రకారం వృద్ధి రేటు పెరిగితే వచ్చే సంవత్సరం భారత్ ప్రపంచంలోనే అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. బ్రిటన్‌ను వెనక్కి నెడుతుంది’ అని జైట్లీ శుక్రవారం ఒక ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ గ్రామీణ భారతానికి నినాదాలు ఇచ్చింది- ప్రధానమంత్రి మోదీ వనరులు ఇచ్చారు’ అనే శీర్షికతో జైట్లీ ఈ ఫేస్‌బుక్ పోస్ట్‌ను పెట్టారు. గత నాలుగేళ్లుగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్న మనం వచ్చే దశాబ్దంలో ఆర్థిక వ్యవస్థ విస్తరణపై దృష్టి పెట్టగలం’ అని జైట్లీ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంక్ తాజా నివేదిక ప్రకారం భారత్ ఫ్రాన్స్‌ను ఏడో స్థానంలోకి నెట్టి ప్రపంచంలో ఆరో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. అమెరికా అగ్ర స్థానంలో కొనసాగుతుండగా, తరువాత స్థానాల్లో వరుసగా చైనా, జపాన్, జర్మనీ, బ్రిటన్ ఉన్నాయి.