బిజినెస్

కాలికట్‌లో పెద్ద విమానాల రాకపోకలపై త్వరలో నిర్ణయం: సురేష్ ప్రభు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: కేరళ కాలికట్ విమానాశ్రయంలో పెద్ద విమానాలు ల్యాండయ్యేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. గతంలో ఈ విమానాశ్రయం నుంచి పెద్ద విమానాల రాకపోకలు ఉండేవి. కాని 2015 మే నెలలో పెద్ద విమాన సర్వీసులను రద్దుచేశారు. డైరెక్టరేట్ జనరల్ సివిల్ ఏవియేషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా విమానాశ్రయాలు ఉండాలని ఆయన చెప్పారు. ఇక్కడ ఆయన విలేఖర్లతో మాట్లాడారు. కాలికట్ విమానాశ్రయం నుంచి పెద్ద విమానాల సర్వీసులను నడపాలని, గతంలో జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని వినతిపత్రాలు వస్తున్నాయన్నారు. ఇక్కడ వౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాను కోరినట్లు చెప్పారు. అన్ని తనిఖీలు పూర్తయిన తర్వాత వెంటనే పెద్దవిమానాలు దిగేందుకు అనుమతులు ఇస్తామన్నారు.