బిజినెస్

కంపెనీల చట్టం సరళీకృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జైపూర్, జూలై 14: వాణిజ్య లావాదేవీలు సులువుగా జరిగేందుకు వీలుగా కంపెనీ చట్టాన్ని సరళీకృతం చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. శనివారం ఇక్కడ ఆయన వాణిజ్యవేత్తల సమావేశంలో మాట్లాడుతూ, వాణిజ్య లావాదేవీలకు సంబంధించి చీటికిమాటికీ న్యాయపరమైన సమస్యలు, ప్రాసిక్యూషన్ తలెత్తకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కాని తప్పిదాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కంపెనీల చట్టంలో అసంబద్ధమైన అంశాలు ఉన్నాయని, వాటిని గుర్తించి తొలగిస్తామన్నారు. కంపెనీ చట్టానికి సవరణలు తెస్తామన్నారు. వస్తుసేవా పన్ను అద్భుతమైందని, దేశ వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోందన్నారు. పన్నుల విధానాన్ని సరళీకృతం చేసిందని, ప్రతి వ్యాపారి చట్టానికి విధేయుడిగా ఉండే విధంగా జీఎస్‌టీ ఉందన్నారు. పన్నుల చెల్లింపుకు దాఖలు చేసే రిటర్న్స్ విధానాన్ని కూడా సరళీకృతం చేశామనన్నారు. ఈ అంశాలను వచ్చే జీఎస్‌టీ సమావేశంలోచర్చిస్తామన్నారు. జీఎస్‌టీ ఇంకా ఎలా ఉండాలో సలహాలు ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే పాల్గొన్నారు.