బిజినెస్

దూసుకెళుతున్న భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, 2030 నాటికి 10 ట్రిలియన్ డాలర్ల స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)తో ప్రపంచంలోనే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్ పేర్కొన్నారు. ‘మున్ముందు మంచి రోజులు రాబోతున్నాయి. దేశంలో మంచి పని జరిగింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునే దశలో ఉంది. భారతీయులు తలెత్తుకొని తిరిగే పరిస్థితుల్లో ఉన్నారు’ అని ఆయన అన్నారు. శనివారం ఇక్కడ జరిగిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్లాటినమ్ జూబ్లీ వేడుకలలో గార్గ్ మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం తొలి నాలుగు దశాబ్దాలలో భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 3.5 శాతం పుంజుకోగా, నేడు 7-8 శాతం వృద్ధి చెందుతోందని అన్నారు. ‘2030 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మనం ధర్మబద్ధంగా అంచనా వేయగలం. ఇదో సవాలు. ఇదో అవకాశం’ అని గార్గ్ పేర్కొన్నారు. ‘ఆర్థిక వ్యవస్థ ఎనిమిది శాతం వృద్ధి సాధించడానికి ఎంతో అవకాశం ఉంది. దాన్ని సాధించి, కొనసాగించగలిగితే భారత ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలోనే మూడో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది’ అని గార్గ్ వివరించారు. భారత్ 2017లో ఫ్రాన్స్‌ను వెనక్కి నెట్టి 2.59 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో ప్రపంచంలో ఆరో పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన విషయాన్ని ప్రపంచ బ్యాంక్ నివేదిక ఇటీవల వెల్లడించిన నేపథ్యంలో గార్గ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘్భరత ఆర్థిక వ్యవస్థ 2022 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఎకానమీగా ఉంటుందనేది మా అంచనా. మరింత ముందుకు సాగుతూ 2030 నాటికి మొత్తం ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ ఎకానమీ సగానికి పెరిగే అవకాశం ఉంది’ అని గార్గ్ పేర్కొన్నారు. 2018 మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు త్రైమాసికాల గరిష్ఠ స్థాయి 7.7 శాతంతో వృద్ధి చెందింది. ప్రభుత్వ వ్యయం, పెట్టుబడులు పెరగడం వల్లనే ఇది సాధ్యమయింది.

చిత్రం..ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ప్లాటినమ్ జూబ్లీ వేడుకల్లో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి పీ.పీ.చౌదరి, ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్, సీఎంఏ అధ్యక్షుడు సంజయ్ గుప్త తదితరులు