బిజినెస్

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు వరుసగా మూడో రోజు శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ధరల పట్టిక ప్రకారం ఇప్పుడు లీటర్ పెట్రోల్ ధర దేశ రాజధాని ఢిల్లీలో రూ. 76.95కు, ముంబయిలో రూ. 84.33కు పెరిగింది. కోల్‌కతా, చెన్నైలలో లీటర్ పెట్రోల్ ధర వరుసగా రూ. 79.61, రూ. 79.87కు పెరిగింది. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ. 68.61కు పెరిగింది. అలాగే, డీజిల్ ధరలు ముంబయిలో లీటర్‌కు రూ. 72.80, కోల్‌కతాలో రూ. 71.16, చెన్నైలో రూ. 72.43 చొప్పున పెరిగాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు శనివారం ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వచ్చాయి. ఐవోసీతో పాటు మరో రెండు ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచాయి. పెట్రోల్, డీజిల్ ధరలను ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సవరించడానికి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలకు ప్రభుత్వం జూన్ నెల మధ్యలో అనుమతి ఇచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలతో పాటు తమ వ్యయాన్ని బట్టి ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి.