బిజినెస్

సేవల రంగంలోకి తగ్గిన ఎఫ్‌డీఐలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: గత ఆర్థిక సంవత్సరంలో దేశంలో సేవల రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐల) రాక సుమారు 23 శాతం తగ్గి 6.7 బిలియన్ డాలర్లకు చేరింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసి అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) ఈ విషయం వెల్లడించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో దేశ సేవల రంగం 8.68 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలను ఆకర్షించింది. సేవల రంగంలో ఫైనాన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఔట్‌సోర్సింగ్, ఆర్‌అండ్‌డీ, కొరియర్, టెక్ టెస్టింగ్, అనాలిసిస్ ఉన్నాయి. మొత్తంమీద దేశంలోకి ఎఫ్‌డీఐల రాకను పరిశీలిస్తే, 2017-18లో ఎఫ్‌డీఐల రాక అయిదేళ్ల కనిష్ట స్థాయిలో మూడు శాతం వృద్ధితో 44.85 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. డెలాయిట్ ఇండియా భాగస్వామి, ప్రముఖ ఆర్థికవేత్త అనిస్ చక్రవర్తి కథనం ప్రకారం, అమెరికాలో వడ్డీ రేట్లు పెరగడంతో పాటు డాలర్ బలపడటం వల్ల ఆ దేశంలోకి పెట్టుబడులు మరలడం వల్లనే భారత్‌లోకి ఎఫ్‌డీఐల రాక మందగించింది. ‘అమెరికాలో వడ్డీ రేట్లు మరింత పెరుగుతాయనే అంచనాలతో పాటు సుంకాల అంశాల కారణంగా ఈ సంవత్సరం భారత్‌లోకి ఎఫ్‌డీఐల రాక మరింత మందగిస్తుంది. భారత్‌లోకి ఎఫ్‌డీఐల రాక వృద్ధి రేటు పడిపోవడం అనేది ప్రధానంగా బహిర్జాత ప్రభావం వల్ల కలుగుతోంది. అయితే దేశ విధాన నిర్ణేతలు స్థూలార్థిక నిర్వహణపై దృష్టి కేంద్రీకరణను కొనసాగించవలసి ఉంటుంది’ అని చక్రవర్తి పేర్కొన్నారు. 2017-18లో రసాయన రంగంలోకి ఎఫ్‌డీఐల రాక వృద్ధి కూడా స్వల్పంగా తగ్గింది. 2016-17లో 1.39 బిలియన్ డాలర్లను ఆకర్షించిన ఈ రంగం 2017-18లో 1.30 బిలియన్ డాలర్లను మాత్రమే రాబట్టుకోగలిగింది. భారత్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో సేవల రంగం వాటా 60 శాతానికి పైగా ఉంది. రానున్న సంవత్సరాలలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు అవసరం ఉన్నందున భారత్‌కు ఎఫ్‌డీఐలను ఆకర్షించడం ఎంతో ముఖ్యం.