బిజినెస్

ఆంధ్రా రొయ్యపై అమెరికా ఆంక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం: దేశ ఆక్వా ఎగుమతుల్లో సింహభాగం ఆక్రమిస్తున్న ఆంధ్రా రొయ్యలపై అమెరికా ఆంక్షలు విధించింది. దీనితో రొయ్య పరిశ్రమకు గడ్డకాలం ఏర్పడింది. ఇప్పటికే సుమారు 22 దేశాల ఆంక్షలను ఎదుర్కొంటున్న ఆక్వా ఉత్పత్తులకు అమెరికా నిర్ణయం ఆశనిపాతం వంటిదే. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి జరిపే ప్రత్యేక పరీక్షల్లో ఆంధ్రా రొయ్యలు ఆరోగ్యం అని తేలితేనే ఆమెరికా మార్కెట్‌లోకి అడుగుపెట్టడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఆ దేశ వాణిజ్య చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. ఇప్పటికే అమెరికాకు గతంలో పంపించిన కంటైనర్లలో 13 కంటైనర్ల వెనక్కి తిరిగి వచ్చేసిన సంగతి తెలిసిందే. తిరిగి వచ్చిన వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి ఉండటం విశేషం. సీఫుడ్ ఇంపోర్ట్ మానిటరింగ్ ప్రోగ్రాం (సింప్) విధానంలో 2019 జనవరి 1 నుంచి అమెరికా భారత్ నుంచి దిగుమతి అయ్యే రొయ్యలను తనిఖీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే రొయ్యల్లో యాంటిబయోటిక్స్ అవశేషాలు ఉంటున్నాయని గుర్తించిన అమెరికా ఇక్కడ నుంచి వెళ్ళిన కంటైనర్లను గతంలో వెనక్కి పంపించేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న అమెరికా సింప్ పరీక్షల విధానాన్ని ఆంధ్ర రొయ్యల పై అమలు చెయ్యనుంది. భారత్ దేశంలో అత్యధిక రొయ్యలను ఉత్పత్తి చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఎగుమతిదారులు చేసే రొయ్యల ప్యాకింగ్ పై కచ్చితంగా చెరువులో రొయ్యను పట్టుకున్నప్పటి నుంచి ఏ ఏ స్థాయిలో దాన్ని ప్రోసెసింగ్ చేసి, ప్యాకింగ్ చేశారో ఆ వివరాలు కచ్చితంగా పేర్కొనాల్సివుంది. అమెరికాలోని నేషనల్ ఓషన్ కౌన్సిల్ కమిటీ (ఎన్‌ఒసీసీ), ఇంటర్నేషనల్ ట్రేడ్ డేటా సిస్టం (ఐటీడీఎస్) తదితర సంస్థలు గూగుల్‌లో వెతికితే వెంటనే తెలిసేలా వివరాలు ఉండాలి. అప్పుడే మన రొయ్యలకు సింప్ అనుమతులను జారీచేసి వాణిజ్య మార్కెట్‌లోకి అనుమతిస్తారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మత్య్సశాఖ లెక్కల ప్రకారం 22 దేశాల్లో ఆంధ్రప్రదేశ్ రొయ్యను రెడ్ లిస్ట్‌లో చేర్చారు. దీని వల్ల ఆయా దేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. కొద్ది రోజుల క్రితం భీమవరం వచ్చిన మత్య్సశాఖ కమిషనర్ రమాశంకర్ నాయక్ ఈమేరకు ఆక్వా రైతులకు హెచ్చరికలు కూడా జారీచేశారు. ధరలేక రొయ్య రైతులు ఇబ్బందులు పడ్డారని, జనవరి-2019 నుంచి అమెరికా మార్కెట్ తెరుచుకుంటుందని, అప్పటికీ మన రొయ్య రైతులు నాణ్యంగా సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆంధ్రా రొయ్యలకు ఉన్న అతిపెద్ద మార్కెట్ అమెరికా అని యాంటిబయోటిక్స్ అవశేషాలు వంటివి లేకుండా మంచి ఉత్పత్తులు చెయ్యాలని రైతులకు సూచించారు. ఇదిలావుండగా అనధికార చెరువులను గుర్తించడంలో ఎంపెడాతో పాటు మరోపక్క మత్య్సశాఖ కృషిచేస్తోంది. ఇప్పటి వరకు ఏదోవిధంగా ఎగుమతులు జరిగిపోతుండటంతో ఎవరికీ ఇబ్బందిలేదు. కాని ప్రస్తుత పరిస్ధితుల్లో యాంటిబయోటిక్స్ విషయంలో భారత్‌కు అమెరికా హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో ఎంపెడా రంగంలోకి దిగింది. ఆక్వా రైతులకు స్మార్ట్‌కార్డులను అందిస్తున్నారు. దీనివల్ల ఏ రైతు ఏ సర్వే నెంబర్‌లో ఎటువంటి ఆక్వా ఉత్పత్తులను సాగుచేస్తున్నారో తెలుస్తోంది. తద్వారా ఎగుమతిదారుడు కూడా ఏ చెరువులోని ఆక్వా ఉత్పత్తులను కొనుగోలు చేశారో కూడా తెలుస్తోంది దాని ఆధారంగా ఏ దేశానికి ఆక్వా ఉత్పత్తులను ఎగుమతిచేసినా దాని వివరాలను దిగుమతి చేసుకునే దేశానికి అందుబాటులో ఉంటాయి.