బిజినెస్

1.15 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో కొత్త గోదాముల నిర్మాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 16: రాష్ట్రంలో ఆహారధాన్యాల నిలువకు విపరీతమైన డిమాండ్ నెలకొన్న నేపథ్యంలో కొత్తగా లక్షా, 15వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను సొంత నిధులతో నిర్మించాలని సోమవారం నాడిక్కడ జరిగిన రాష్ట్ర గిడ్డంగుల సంస్థ పాలకవర్గ సమావేశం నిర్ణయించింది. సంస్థ చైర్మన్ ఎల్‌వీఎస్‌ఆర్‌కే ప్రసాద్ తన అధ్యక్షోపన్యాసంలో ఇప్పటి వరకు 13 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఆహార ధాన్యాల నిల్వ సదుపాయంతో కూడిన గోదాములు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ప్రస్తుత సంవత్సరంలో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. వచ్చే డిసెంబర్ మాసాంతానికి గుంటూరు జిల్లా వడ్లపాడులోని స్పైసెస్ పార్కులో మిర్చి, టర్మిరిక్ ప్రొసెసింగ్ మరియు కోల్డ్ స్టోరేజీల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. వీటికి గత మే నెల 7వ తేదీన సీఎం చంద్రబాబు స్వయంగా శంకుస్థాపన చేసారని ప్రసాద్ తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కేవీ రమణ తదితరులు ఉన్నారు.