బిజినెస్

13సెజ్‌లకు మరింత గడువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 16: దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆర్థిక జోన్ల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం వీటి ఏర్పాటుకు సంబంధించి మరింత వెసులుబాటు కల్పించింది. హెచ్‌బిఎస్ ఫార్మా, డిఎల్‌ఎఫ్ ఇన్ఫో సహా మొత్తం 15 సెజ్ డెవలపర్లకు వీటి ఏర్పాటుకు సంబంధించి మరింత గడువును ఇస్తున్నట్టు ప్రకటించింది. వాణిజ్య వ్యవహారాల కార్యదర్శి రీటా టియోటియా సారథ్యంలో జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక ఆర్థిక జోన్ల ఏర్పాటుకు సంబంధించి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి అప్రూవల్ బోర్డే అత్యున్నత నిర్ణాయక సంస్థ కావడం గమనార్హం. గుజరాత్‌లో తలపెట్టిన తన ప్రాజెక్టును పూర్తి చేయడానికి హెచ్‌బిఎస్ సెజ్‌కు వచ్చే ఏడాది జూన్ వరకూ గడువులభించింది. మహారాష్టల్రో నిర్మించ తలపెట్టిన ఐటి, ఐటిఇ ప్రాజెక్టులకు సంబంధించి డిఎల్‌ఎఫ్‌కు వచ్చే ఏడాది జూన్ వరకూ వ్యవధి లభించింది.
అలాగే తమిళనాడు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ వివిధ రాష్ట్రాల్లో తలపెట్టిన సెజ్‌ల నిర్మాణానికీ మరింత గడవునిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.