బిజినెస్

భారీగా తగ్గిన సెనె్సక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత నాలుగు సంవత్సరాల్లో ఎన్నడూ లేని రీతిలో టోకు ధరల ద్రవ్యోల్బణ సూచి పెరిగిన ప్రభావం సోమవారం జరిగిన మార్కె ట్ లావాదేవీలపై తీవ్రంగా కనిపించింది. దీనితో ఇనె్వస్టర్లు ఆచితూచి అడుగు వేయడంతో భారీగానే షేర్ల విక్రయం జరిగింది. బ్యాంకిం గ్, ఫార్మా తదితర కంపెనీల షేర్ల అమ్మకాల కారణంగా ఇటు సెనె్సక్స్, అటు నిఫ్టీలు భారీగా పడిపోయాయి. సెనె్సక్స్ ఏకంగా 218 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 11వేల దిగువకు చేరుకుంది. డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, లూపిన్ సహా అనేక నిఫ్టీ కంపెనీలు నష్టాలను చవిచూశాయి. అమెరికా- చైనా వాణిజ్య యుద్ధ తీవ్రత కారణంగా రెండో త్రైమాసికంలో చైనా వృద్ధి రేటు తగ్గడం ఆసియా మార్కెట్లపై ప్రభావాన్ని కనబరిచింది. లావాదేవీల ప్రారంభంలో సెనె్సక్స్ ఆశాజనకంగానే కనిపించి లాభాల బాటలో ముందుకు వెళ్లినప్పటికీ ద్రవ్యోల్బణ ప్రతికూల ప్రభావం కారణంగా ఆ లాభాలు అనంతర లావాదేవీల్లో హరించుకు పోయాయి. ఫలితంగా 217.86 పాయింట్లు నష్టపోయి 36,323.77 పాయింట్ల వద్ద సెనె్సక్స్ ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 82.05 పాయిం ట్లు కోల్పోయి 10,926.25 పాయింట్ల వద్ద క్లోజయింది. ద్రవ్యోల్బణం పెరగడం, అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు తలెత్తడంతో ఇనె్సస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారని విశే్లషకులు వెల్లడించారు. ద్రవ్యోల్బణం పెరగడం వల్ల వృద్ధిరేటు మందగించడంతో పాటు ఆర్థిక వ్యవస్థకూ నష్టమేనని తెలిపారు.