బిజినెస్

ఐటీఐలకు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు అనుసంధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 17: స్కిల్ డవలప్‌మెంట్ కేంద్రాలను ఐటిఐలకు అనుసంధానం చేయనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి కార్మిక, ఉపాధిశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం కార్మిక, ఉపాధిశాఖ కార్యకలాపాలపై సిఎస్ సమీక్షించారు. రాష్ట్రంలో 291 ఐటిఐలలో 73 వేవ మంది విద్యనభ్యసిస్తున్నారని సిఎస్ వివరించారు. అలాగే 16 ఐటిఐలు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. సిఎస్‌ఆర్ నిధుల ద్వారా ఐటిఐలకు వౌలిక వసతులు కల్పించాలన్నారు. ఐటిఐలు సాధించిన మంచి ఫలితాలను పరిగణనలోకి తీసుకొని గ్రేడింగ్ ఇవ్వాలని సిఎస్ ఆదేశించారు. వివిధ పరిశ్రమలు, స్కిల్ డవలప్‌మెంట్ సెంటర్లను ఐటిఐలతో అనుసంధానం చేయాలని సూచించారు. నేషనల్ అప్రెంటిస్ షిప్ ప్రమోషన్ స్కీమ్‌లో భాగంగా 8993 మందికి శిక్షణ ఇచ్చామన్నారు. రాష్ట్ర స్థాయి కౌన్సిల్‌ను ఏర్పాటు చేసామని, త్వరలో జిల్లాస్థాయిలో కమిడీలను ఏర్పాటు చేయనున్నట్టు సిఎస్ చెప్పారు. ఉపాధి కల్పనా కార్యాలయాలను పునరుద్ధరించి నిరుద్యోగుల వివరాలు సేకరించాలని ఆదేశించారు. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ప్రత్యేక హెల్త్ స్కీమ్‌ను 15 రోజుల్లో ఏర్పాటు చేయాలని కార్మిక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 10.62 లక్షల భవన నిర్మాణ కార్మికులు నమోదయ్యారన్నారు. ఇప్పటి వరకు 13,883 మందికి 54.91 కోట్లు అందించామన్నారు.