బిజినెస్

మేలైన కాటన్ వస్త్రాలకు ‘రామ్‌రాజ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 19: మేలైన కాటన్ వస్త్రాలకు రామ్‌రాజ్ కాటన్ షోరూమ్ పెట్టింది పేరని ప్రజల్లో అపారమైన విశ్వాసం ఏర్పడిందని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్ రెడ్డి అన్నారు. తిరుమల బైపాస్ రోడ్డులో కొర్లగుంట పంచాయతీ మారుతీనగర్‌లో టిఎంఆర్ కల్యాణమండపం ఎదురుగా రామ్‌రాజ్ షోరూం సంస్థ ఏర్పాటు చేసిన రెండో బ్రాంచ్‌ను గురువారం మంత్రి అమరనాధ్ రెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు గల్లా అరుణకుమారీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రామ్‌రాజ్ సంస్థ చైర్మన్ కె ఆర్ నాగరాజన్ మాట్లాడుతూ తమ సంస్థ తయారు చేసే ఉత్పత్తులు దక్షిణాది రాష్ట్రాల్లో విశేష ఆదరణ పొందుతున్నాయన్నారు.
ముఖ్యంగా సాంప్రదాయ వస్త్రాలకు తమ సంస్థకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. త్వరలోనే తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లోని ముఖ్య కేంద్రాల్లో షోరూమ్‌లు ప్రారంభింస్తామని చెప్పారు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు.రామ్‌రాజ్‌కాటన్.ఇన్ ద్వారా ఆన్‌లైన్ విక్రయాలు చేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీలంక, సింగపూర్, మలేషియా వంటి దేశాలకు తమ ఉత్పత్తులు ఎగుమతులు చేస్తున్నామన్నారు. ధోవతీ, పంచె, చొక్కాయ్, మెల్కిన్ పంచెలు, పంచాకచ్చ ధోవతీలు, శిల్క్ పంచెలు, ఫుల్ కాటన్ చొక్కాలు, శుభముహూర్త చొక్కాలు, బార్డర్ మేచింగ్ చొక్కాలు, యువతకు టీ షర్ట్స్ విక్రయిస్తున్నట్లు చెప్పారు. తమ సంస్థ విక్రయాలు దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలోను విస్తరిస్తున్నట్లు వెల్లడించారు. ప్రతి ఏడాది 25శాతం విక్రయాలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు. కాటన్ వస్త్రాల్లో తమ సంస్థ ఉత్పత్తులకు తిరుగులేని విధంగా ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమన్నారు. అనేక విమానాశ్రయాల్లో కూడా తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచామన్నారు. ఎప్పటికప్పుడు ఖాతాదారులను సంతృప్తి పరిచే విధంగా ఉత్పత్తులను వారి అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించామన్నారు. ఈ కార్యక్రమంలో సినీ యాక్టర్ దేవేంద్ర సింగ్, తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా చైర్మన్ నరసింహయాదవ్, ఎమ్మెల్సీ దొరబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దొరబాబు తదితరులు పాల్గొన్నారు.