బిజినెస్

ఇప్పుడైతే ముప్పు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: భారత్ అమెరికాకు చేస్తున్న ఉక్కు ఎగుమతులు చాలా తక్కువని, అందువల్ల అమెరికా ఉక్కు దిగుమతులపై పెంచిన సుంకాల వల్ల భారత పరిశ్రమకు ఇప్పటికిప్పుడే ఎలాంటి ముప్పు వాటిల్లబోదని కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే, యూరోపియన్ యూనియన్ దిగుమతి సుంకాల విధానమే భారత్‌కు ఆందోళన కలిగిస్తోందని, భారత్ ఇప్పటికే యూరోపియన్ యూనియన్ విధానంలోని కొన్ని అంశాల పట్ల తన అభ్యంతరం వ్యక్తం చేసిందని ఉక్కు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘గత సంవత్సరం మన ఉక్కు ఉత్పత్తి సామర్థ్యం 124 మిలియన్ టన్నులు. మనం చేసిన ఉత్పత్తి 102 మిలియన్ టన్నులు. మన ఎగుమతులు పది మిలియన్ టన్నులు’ అని కేంద్ర ఉక్కు శాఖ కార్యదర్శి అరుణాశర్మ తెలిపారు. ‘మనం అమెరికాకు ఎగుమతి చేస్తున్న ఉక్కు 0.9 మిలియన్ టన్నులకు తక్కువే. అందువల్ల అమెరికా దిగుమతి సుంకాలు పెంచడం వల్ల మనపై ఇప్పటికిప్పుడే ఎలాంటి ప్రమాదం ఉండబోదు’ అని ఆమె శుక్రవారం ఇక్కడ విలేఖరులకు చెప్పారు. అమెరికా ఉక్కుపై 25 శాతం, అల్యూమినియంపై పది శాతం చొప్పున దిగుమతి సుంకాలను విధించింది. ‘్భరత వాణిజ్య మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఒక బృందం ఇప్పటికే ఈ దిగుమతి సుంకాల విషయమై అమెరికా పాలనా యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతోంది. మనం కేవలం రెండు శాతం మాత్రమే ఉక్కును ఎగుమతి చేస్తున్నాం. అందువల్ల అమెరికా సుంకాలను పెంచడం వల్ల వెంటనే మనపై పెద్దగా ప్రభావం ఉండబోదు’ అని అరుణాశర్మ పేర్కొన్నారు. అసోచామ్ శుక్రవారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న అరుణాశర్మ ఈ సందర్భంగా విడిగా మాట్లాడుతూ భారత్ తప్పకుండా తన ప్రయోజనాలను పరిరక్షించుకుంటుందని, ఈ విషయంలో వాణిజ్య మంత్రిత్వ శాఖ ముందు పీఠిన ఉంటుందని పేర్కొన్నారు. అమెరికా సుంకాలను పెంచడం వల్ల ఇతర దేశాలు తమ అదనపు ఉక్కును భారత్‌కు ఎగుమతి చేస్తాయా? అని ప్రశ్నించగా, ‘ఇప్పటి వరకు ఇది జరగలేదు. మేము అప్రమత్తంగా ఉన్నాం. అలా జరుగకుండా అవసరమైతే చర్యలు తీసుకుంటాం’ అని బదులిచ్చారు.