బిజినెస్

బాబోయ్ కొత్త నోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: వంద రూపాయల డినామినేషన్ గల కొత్త సిరీస్ నోట్లను విడుదల చేయనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) చేసిన ప్రకటన దేశంలోని ఆటోమాటిక్ టెల్లర్ మెషిన్ల (ఏటీఎంల)ను తయారు చేసి, సరఫరా చేసే ప్రధాన కంపెనీలలో ఆందోళన మొదలయింది. దేశంలో పెద్ద నోట్ల రద్దు తరువాత విడుదల చేసిన కొత్త రూ. 2,000, రూ. 500, రూ. 200, రూ. 10 డినామినేషన్ల కొత్త నోట్ల వలెనే ఇప్పుడు విడుదల చేయనున్న రూ. వంద డినామినేషన్ గల కొత్త నోట్లు కూడా ఇప్పటికే చలామణిలో ఉన్న నీలి రంగులో గల రూ. వంద డినామినేషన్ నోట్లతో పోలిస్తే కాస్త చిన్నగా ఉండనున్నాయి. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ. వంద నోట్లు 157 మిల్లీ మీటర్ల పొడవు, 73 మిల్లీ మీటర్ల వెడల్పులో ఉన్నాయి. ఆర్‌బీఐ ప్రకటించిన దాని ప్రకారం కొత్తగా చలామణిలోకి రానున్న రూ. వంద నోట్లు 142 మిల్లీ మీటర్ల పొడవు, 66 మిల్లీ మీటర్ల వెడల్పులో ఉంటాయి. ‘అందువల్ల దేశ వ్యాప్తంగా ఉన్న 2,37,000 ఏటీఎంలను కొత్త రూ. వంద నోట్లను వినియోగదారులకు అందజేసే విధంగా రీక్యాలిబరేట్ (కొలతలను మార్చడం) చేయవలసి ఉంది. ఈ రీక్యాలిబరేట్ చేసే ప్రక్రియ అంతా సమయం పట్టే, వ్యయంతో కూడుకొని ఉంటుంది’ అని కానె్ఫడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ డైరెక్టర్ వి.బాలసుబ్రమణియన్ ఒక వార్తాసంస్థకు చెప్పారు. ఏటీఎంలను రీక్యాలిబరేట్ చేయడానికి ఆపరేటర్లకు సంబంధిత బ్యాంకు అధికార క్యాష్ ఏజెన్సీ, ఏటీఎంను తయారు చేసిన సంస్థకు సంబంధించిన ఇంజనీర్ సహకారం అవసరం. ‘ఒక్కో ఏటీఎం రీక్యాలిబరేషన్‌కు 20 నిముషాల సమయం తీసుకున్నా, ఇందులో భారీగా లాజిస్టిక్ అంశాలు ఇమిడి ఉంటాయి. బ్యాంకు సహకారాన్ని బట్టి రోజుకు 15-20 ఏటీఎంలను రీక్యాలిబరేట్ చేసినా, దేశ వ్యాప్తంగా ఈ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి చాలా రోజులు పడుతుంది. పైగా భారీగా వ్యయం అవుతుంది’ అని బాలసుబ్రమణియన్ పేర్కొన్నారు. హిటాచి పేమెంట్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ లోనీ ఆంటోనీ అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా గల ఏటీఎంల రీక్యాలిబరేషన్ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి రూ. వంద కోట్ల వ్యయం అవుతుంది. సుమారుగా ఒక సంవత్సరం కాలం పడుతుంది. ‘నిజానికి, నిరుడు కొత్తగా చలామణిలోకి తీసుకొచ్చిన రూ. 200 నోట్లను అందించే విధంగా చేపట్టిన రీక్యాలిబరేషన్ ప్రక్రియ ఇప్పటికీ అన్ని ఏటీఎంలలో పూర్తి కాలేదు. సరయిన ప్రణాళిక ఉంటే తప్ప, కొత్తగా రానున్న రూ. వంద నోట్లకు అనుగుణంగా ఏటీఎంల రీక్యాలిబరేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాదికన్నా ఇంకా ఎక్కువ సమయం పడుతుంది’ అని ఆంటోనీ పేర్కొన్నారు.