బిజినెస్

టివిఎస్ స్కూటీ జస్ట్ 110 ‘హిమాలయన్ హైస్’ సీజన్-2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 5: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టివిఎస్.. వచ్చే నెల ఆగస్టులో టివిఎస్ స్కూటీ జస్ట్ 110 ‘హిమాలయన్ హైస్’ సీజన్-2ను ప్రారంభించనుంది. ఈ మేరకు ఇక్కడ మంగళవారం ఓ ప్రకటనలో ఆ సంస్థ ప్రకటించింది. నిరుడు ఆగస్టులో టివిఎస్ స్కూటీ జస్ట్ 110తో హిమాలయాల్లోని ఖార్దుంగ్ లా వరకు వెళ్లిన లక్నోకు చెందిన ఆనం హషిం ఆధ్వర్యంలో ‘హిమాలయన్ హైస్’ సీజన్-2 జరుగుతుందని స్పష్టం చేసింది. కాగా, ఎంట్రీలు, ఆడిషన్ల ఆధారంగా 10 మంది మహిళా రైడర్లను ఎంపిక చేస్తామని, వారికి బెంగళూరులోని టివిఎస్ బృందం తగిన శిక్షణను అందిస్తుందని సంస్థ తెలిపింది. గత నెల జూన్ 2 నుంచే ఈ రైడింగ్ కోసం రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయని, ఆసక్తిగలవారు మరిన్ని వివరాల కోసం తీతీతీ.ఆ్పఒఒష్య్యఆక.ష్యౄని సందర్శించవచ్చని చెప్పింది. ఇక ‘హిమాలయన్ హైస్’ సీజన్-1లో ప్రపంచంలోనే ఎతైన రహదారిపై టివిఎస్ స్కూటీ జస్ట్ 110తో ఆనం ప్రయాణించిందని, ఈ యాత్రకు అనూహ్యమైన స్పందన లభించిందని టివిఎస్ మోటార్ సంస్థ మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు అనిరుధ్ హల్దార్ అన్నారు. ఈ స్పందన నేపథ్యంలోనే సీజన్-2ను నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.