బిజినెస్

ఎగుమతులు పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశాభివృద్ధిలో ఎగుమతిదారులు కీలకపాత్ర వహిస్తారని, లాటిన్ అమెరికా, ఆఫ్రికాదేశాలకు ఎగుమతులను విస్తరించేందుకు ప్రణాళికలను రూపొందించుకోవాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి సురేష్ ప్రభు కోరారు. ఈ దేశాల్లో శరవేగంగా విస్తరిస్తున్న మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దేశంలో ఎగుమతులను పెంచేందుకు వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికలను ఖరారు చేశామన్నారు. ఎగుమతులు చేస్తే వస్తువుల విషయంలో విశ్వసనీయత, నాణ్యత అవసరమన్నారు. ఎగుమతిదారుల కోసం రూపొందించిన యాప్‌ను ఆయన ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహిస్తామన్నారు. ఈ అంశంపై త్వరలో మంత్రివర్గంలో చర్చించి ఒక విధానాన్ని రూపొందించనున్నట్లు చెప్పారు. భారత వాణిజ్య ఎగుమతులు 2016-17లో 275.85 బిలియన్ డాలర్లు ఉండగా, 2017-18కి 303.38 బిలియన్ డాలర్లకు పెరిగిందన్నారు. సేవా రంగంలో ఉత్పత్తుల ఎగుమతులు 164.2 బిలియన్ డాలర్ల నుంచి 195 బిలియన్ డాలర్లకు పెరిగాయన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ రూపొందించిన నిర్యత్ మిత్ర యాప్‌ను ఎగుమతిదారులు విస్తృతంగా ఉపయోగించుకోవాలన్నారు. అంతర్జాతీయ వాణిజ్య హక్కులు, ఎగుమతి, దిగుమతి విధానాలు, జీఎస్‌టీ వర్తింపు, టారిఫ్, ప్రోత్సాహకాలు, మార్కెట్‌తో అనుసంధానం తదితర వివరాలు ఉంటాయన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రోజూవారీ చోటు చేసుకుంటున్న ఎగుమతి విధానాల్లో మార్పులను తెలుసుకోవచ్చన్నారు. ఎఫ్‌ఐఈఓ డీజీ అజయ్ సహాయ్ మాట్లాడుతూ ఈ యాప్ దేశంలోని టూటైర్, త్రీ టైర్ నగరాల్లోని ఎగుమతిదారులు, వర్తకులకు ఉపయోగపడుతుందని అన్నారు.