బిజినెస్

జీడీపీ వృద్ధి రేటు 7.5 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, ఆగస్టు 9: భారత్ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి చెందుతుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. అలాగే పెట్టుబడులు బలపడటం, వస్తు వినియోగం విస్తృతంగా పెరగడం వల్ల జీడీపీ వృద్ధి రేటు 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి పెరుగుతుందని తన తాజా అంచనాలో ఐఎంఎఫ్ పేర్కొంది. సమీప భవిష్యత్తులో భారతదేశ స్థూలార్థిక పరిస్థితులు సానుకూలంగా ఉంటాయని ఐఎంఎఫ్ మంగళవారం ప్రచురితమయిన తన తాజా నివేదికలో పేర్కొంది. ‘జీడీపీ వృద్ధి రేటు 2018-19 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతానికి పెరుగుతుంది. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతానికి పెరుగుతుంది. పెట్టుబడులు బలపడటంతో పాటు వస్తు వినియోగం పెరగడం వల్ల జీడీపీ వృద్ధి రేటు పుంజుకుంటుంది’ అని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. డిమాండ్ పరిస్థితులు గట్టిపడటంతో పాటు ఇటీవలి కాలంలో రూపాయి విలువ పడిపోవడం, అధిక ముడి చమురు ధరలు, ఇంటి అద్దె భత్యాలు, పంటల కనీస మద్దతు ధరలు పెరగడం వల్ల ప్రధాన ద్రవ్యోల్బణం 2018-19 ఆర్థిక సంవత్సరంలో 5.2 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ తన నివేదికలో పేర్కొంది. ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో పాటు దిగుమతులకు గట్టి డిమాండ్ ఉండటం వల్ల భారత్ కరెంటు ఖాతా లోటు (సీఏడీ) జీడీపీలో 2.6 శాతానికి పెరుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది.