బిజినెస్

సెనె్సక్స్ @ 38,024

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: బ్యాంకింగ్, లోహ రంగాల షేర్లు పరుగులు తీయడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సరికొత్త రికార్డులు సృష్టించాయి. మార్కెట్ కీలక సూచీలు రెండూ సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయిల వద్ద ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ తొలిసారి 38వేల మార్కుకు పైన ముగిసింది. ఈ సూచీ 136 పాయింట్లు పుంజుకొని 38,024 పాయింట్ల వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ గురువారం కూడా తన రికార్డు పరుగును కొనసాగిస్తూ క్రితం ముగింపుతో పోలిస్తే 20 పాయింట్ల ఎగువన 11,470 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈలోని బ్యాంకింగ్ రంగ సూచీ నిఫ్టీ బ్యాంక్ తన రికార్డు పరుగును కొనసాగిస్తూ 28,320 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలోని సంస్థల్లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిండాల్కో ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, వేదాంత షేర్లు గురువారం రాణించాయి వీటి విలువ 2.5 శాతం నుంచి 4 శాతం వరకు పెరిగింది. ఆస్తుల పరంగా దేశంలోని మూడో అతి పెద్ద బ్యాంక్ అయిన ఐసీఐసీఐ బ్యాంక్ ఫిబ్రవరి ఒకటో తేదీ తరువాత గురువారం ఒకే సెషన్‌లో అత్యధికంగా లాభపడింది. లాభపడిన ఇతర బ్యాంకుల్లో ఐడీఎఫ్‌సీ బ్యాంక్, పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి. వీటి షేర్ల విలువ మూడు నుంచి అయిదు శాతం మధ్య పెరిగింది.
3వివిధ కారణాల వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం బలపడ్డాయి. ఇందులో ఒకటి బ్యాంకింగ్, లోహ రంగాల షేర్ల మద్దతుతో మార్కెట్‌లో కొనసాగిన బుల్ రన్. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ ఈ ర్యాలీకి దన్నుగా నిలిచాయి. తాజాగా ఓ కొత్త సిగరెట్‌ను ఆవిష్కరించిన ఇండెక్స్‌లోని ప్రధాన సంస్థ ఐటీసీ షేర్ విలువ పెరుగుతోంది2 అని ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ రీసెర్చ్ విభాగం అధిపతి ఏకే ప్రభాకర్ పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తాను వార్షిక డివిడెండ్‌గా రూ. 50వేల కోట్లు ప్రభుత్వానికి చెల్లించనున్నట్టు బుధవారం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక రోడ్‌మ్యాప్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుంది. ఈ కారణంగా బ్యాంకింగ్ షేర్లు రాణిస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. జూలై-జూన్ ఆర్థిక సంవత్సరాన్ని పాటిస్తున్న ఆర్‌బీఐ క్రితం ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి రూ. 30,659 కోట్లు వార్షిక డివిడెండ్‌గా చెల్లించింది. చైనా ఉత్పత్తుల కొరత కారణంగా దేశీయంగా లోహరంగ షేర్లు రాణిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) బుధవారం నికరంగా రూ. 568.63 కోట్ల విలువయిన షేర్లను, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 30.25 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.