బిజినెస్

సెక్యూరిటీస్ చట్టాల ఉల్లంఘనపై సెబీ కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: సెక్యూరిటీస్ చట్టాలను ఉల్లంఘించినందుకు 117 కేసుల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సెబి ప్రకటించింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఈ చట్టాల ఉల్లంఘన కేసులు 52 శాతం తగ్గాయి. ధరల రిగ్గింగ్, మార్కెట్‌లో అవకతవకలకు పాల్పడడం తదితర నేరాలకు పాల్పడే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని సెబి పేర్కొంది. 2017-18లో 117 కేసులను సెబి దర్యాప్తుకు చేపట్టింది. 145 కేసుల దర్యాప్తును పూర్తి చేశారు. అంతకు ముందు ఏడాది 155 కేసుల దర్యాప్తు జరిగితే, కొత్తగా 245 కేసుల దర్యాప్తును సెబి ప్రారంభించింది. ఈ మేరకు సెబి నివేదిక విడుదల చేసింది. అంతరంగిక విభాగాల నుంచి వచ్చే ఫిర్యాదులను విశే్లషించి సెబి దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులకు సంబంధించి ఆధారాలను సేకరించడం, అవకతవకలకు పాల్పడిన వ్యక్తులను గుర్తించడం, సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సెబి నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది మార్చిచ 31వ తేదీ నాటికి మొత్తం 1053 కేసుల్లో న్యాయపరమైన, శాఖాపరమైన ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయి.