బిజినెస్

జీఎస్‌టీ పరిహారం రూ. 52,077 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు జీఎస్‌టీ పరిహారం కింద కేంద్ర 52,077 కోట్ల రూపాయలు చెల్లించింది. 2017 జూలై నుంచి 2018 మార్చి వరకు 48,178 కోట్ల రూపాయలు, అదే విధంగా ఈ ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో మొత్తం 3,988 కోట్ల రూపాయలు చొప్పున చెల్లించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా లోక్ సభలో ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు. ఈ ఏడాది జూలై చివరి నాటికి, జీఎస్‌టీని అమలు చేసిన 13 నెలల్లో 11.3 లక్షల కోట్ల రూపాయలు జీఎస్‌టీ కింద వసూలైందని పేర్కొన్నారు. ఏప్రిల్‌లో అత్యధికంగా 1.03 లక్షల కోట్ల రూపాయలు వసూలైనట్టు వివరించారు. మే మాసంలో అత్యల్పంగా 94,016 కోట్ల రూపాయలే వసూలైనట్టు శుక్లా చెప్పారు.