బిజినెస్

తగ్గిన ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు తగ్గాయి. గత తొమ్మిది నెలల్లో మొదటిసారి, గత నెల ఈ తగ్గుదల నమోదైంది. జీఎస్‌టీ అమల్లో తలెత్తుతున్న సమస్యలే దీనికి ప్రధాన కారణమని ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (ఎస్‌ఐఏఎం) ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. గత ఏడాది జూలై మాసంలో 1,92,845 ప్యాసింజర్ వాహనాల అమ్మకం జరిగిందని, ఈ ఏడాది అదే సమయానికి 1,91,979 వాహనాలు అమ్ముడయ్యాయని పేర్కొంది. అయితే, పరిశ్రమ పరిస్థితి మొత్తం మీద సంతృప్తికరంగానే ఉందని వ్యాఖ్యానించింది.
గందగోళాలకు తెరపడి, అమ్మకాలు మళ్లీ పుంజుకుంటాయని ఎస్‌ఐఏఎం ధీమా వ్యక్తం చేసింది. గత ఏడాది అక్టోబర్ మాసంలో ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయని, ఆ పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం లేదని స్పష్టం చేసింది. స్థూలంగా చూస్తే ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో 17 శాతం వృద్ధి నమోదైందని, మొత్తం మీద 90.3 లక్షల వాహనాలు తయారయ్యాయని వివరించింది. కాగా, ఇటీవల వాహనాల అమ్మకాల తగ్గుదలతో ప్రభావితమైన కంపెనీల్లో మారుతీ సుజీకీ కూడా ఉంది. 1.1 శాతం తగ్గుదల నమోదైంది. రాబోయే నెలల్లో మళ్లీ పుంజుకుంటుందని నిపుణుల అభిప్రాయం.