బిజినెస్

ఎస్సీ, ఎస్టీ వాణిజ్యవేత్తలు, పారిశ్రామికవేత్తలకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 13: ఎస్సీ, ఎస్టీ వాణిజ్యవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు మూడు రకాల కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎక్కడైనా పారిశ్రామికవృద్ధికి అవసరమైన వృత్తి విద్యా కోర్సులు చదువుకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ చేసేందుకు వీలుగా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్న సీఎం ఆకాంక్ష మేరకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు పరిశ్రమల శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్ తెలిపారు.
రెసిడెన్షియల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం, కాంట్రాక్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో శిక్షణ ఇవ్వనున్నారు. మూడు నెలల పాటు శిక్షణ ఉంటుంది. పదో తరగతి, ఆపై విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఎంపిక, శిక్షణ సంస్థల ఎంపికను రాష్ట్ర స్థాయి కమిటీ చేపడుతుంది. ఎస్టీ, ఎస్సీ అభ్యర్థులను కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దేందుకు వీలుగా కాంట్రాక్టర్ డెవలప్‌మెంట్ కార్యక్రమం నిర్వహించనుంది. డిప్లొమోలో ఉత్తీర్ణత కనీసార్హత. ఒక్కో కోర్సుకు ఒక్కో అభ్యర్థికి లక్ష రూపాయలను శిక్షణకు ఖర్చు చేయనుంది.