బిజినెస్

లండన్‌లో తాజ్ వివాంటా హోటల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 13: లండన్‌లో 2021 సంవత్సరానికల్లా తాజ్ బ్రాండ్ పేరిట అతి పెద్ద హోటల్ ప్రారంభం కానుంది. ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్) ఆధ్వర్యంలో ప్రారంభం కానున్న ఈ అతి పెద్ద తాజ్ వివాంటా హోటల్ ఏర్పాటుకు సంబంధించి హేరే గ్రూప్ లిమిటెడ్ కంపెనీతో ఐహెచ్‌సీఎల్ గత వారం అగ్రిమెంట్ కుదుర్చుకుంది. లండన్‌లోని హీట్‌త్రో ఎయిర్‌పోర్టు వద్ద 108 గదులతో కూడిన ఈ అధునాతన హోటల్ బ్రిటిష్ రాజధానిలో టాటా గ్రూపుల ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న అతి పెద్ద రెండో హోటల్ కావడం గమనార్హం. ఇందులో బాంకెట్ హాలు, సమావేశాల నిర్వహణకు అవసరమైన సదుపాయాలు ఇందులో ఉంటాయి. ఇప్పటికే సెంట్రల్ లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు సమీపంలో సెంట్ జేమ్స్ కోర్టు హోటల్, సూట్లతో తాజ్ హోటల్ నడుపుతోంది. కాగా, హేరే గ్రూపు లిమిటెడ్‌తో భాగస్వామిగా పేరొందిన వివాంట హోటల్‌ను ఏర్పాటు చేస్తున్నందుకు తమకు గర్వకారణంగా ఉందని ఐహెచ్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునీత్ ఛాట్‌వాల్ తెలిపారు.

పీఎన్‌బీ మాజీ ఎండీ ఉష ఉద్యోగం నుంచి తొలగింపు
న్యూఢిల్లీ, ఆగస్టు 13: కుంభకోణంలో కూరుకుపోయిన పంజాబ్ నేషనల్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకుల మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఉషా అనంత సుబ్రమణియన్‌ను ప్రభుత్వం సోమవారం ఉద్యోగం నుంచి తొలగించింది. మూడు నెలల క్రితం పంజాబ్ నేషనల్ బ్యాంకు 14 వేల కోట్ల కుంభకోణం కేసులో ఆమెపై చార్జిషీట్ దాఖలైనప్పటి నుంచి ఆమె అలహాబాద్ బ్యాంకు ఎండీ బాధ్యతల నుంచి ఆమె వైదొలిగారు. కానీ పంజాబ్ నేషనల్ బ్యాంకు ఉద్యోగిగా మాత్రం ఆమె కొనసాగుతున్నారు. ఆమె సోమవారం సూపర్ నేచురల్ పోస్టును పొందాల్సిన తరుణంలో ప్రభుత్వం ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. ఆమె పంజాబ్ నేషనల్ బ్యాంకులో అత్యున్నత పదవులను అనుభివించారు. 2015 నుంచి 2017 వరకు బ్యాంకుకు ఆమె అధినాయకత్వం వహించారు. ఆ తర్వాత అలహాబాద్ బ్యాంకుకు మారారు. అంతకు ముందు 2011 నుంచి నవంబర్ 2013 వరకు ఆమె పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు.