బిజినెస్

ఊరటనిచ్చిన టోకు ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం జూలై నెలలో 5.09 శాతానికి తగ్గింది. మంగళవారం ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. జూన్ నెలలో 5.77 శాతం ఉన్న టోకు ద్రవ్యోల్బణం.. ఆహార వస్తువుల ధరలు ముఖ్యంగా పళ్లు, కూరగాయల ధరలు తగ్గడం వల్ల జూలై నెలలో 5.09 శాతానికి తగ్గింది. 2017 జూలైలో టోకు ద్రవ్యోల్బణం 1.88 శాతం ఉండింది.
జూన్ నెలలో ఆహార వస్తువుల కేటగిరీలో (+)1.80 శాతం ఉన్న టోకు ద్రవ్యోల్బణం జూలై నెలలో (-)2.16 శాతానికి తగ్గిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. టోకు ధరల సూచీలోని కూరగాయల ధరలు జూలై నెలలో 14.07 శాతం తగ్గాయి. జూన్ నెలలో వీటి ధరలు 8.12 శాతం పెరిగాయి. అదేవిధంగా, పళ్ల టోకు ధరలు జూలైలో 8.81 శాతం తగ్గాయి. జూన్‌లో వీటి ధరలు 3.87 శాతం పెరిగాయి. కాయధాన్యాల కేటగిరీలో జూన్‌లో (-)20.23 శాతం ఉన్న ద్రవ్యోల్బణం జూలైలో (-)17.03 శాతానికి చేరాయి. అయితే, ఆహారేతర వస్తువుల కేటగిరీలో ద్రవ్యోల్బణం జూన్‌లో 3.81 శాతం ఉండగా, జూలైలో 3.96 శాతానికి పెరిగింది. ఇంధనం, విద్యుత్ రంగంలో ద్రవ్యోల్బణం వేగంగా 18.10 శాతం, మాన్యుఫాక్చర్డ్ ఉత్పత్తుల రంగంలో 4.26 శాతం చొప్పున పెరిగింది.
కొన్ని సరుకుల ధరలు పెరగడం వల్ల అందుకు అనుగుణంగా ఈ కేటగిరీల ద్రవ్యోల్బణం కూడా పెరిగిందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రాలో ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. ప్రభుత్వం సోమవారం వెల్లడించిన గణాంకాలలో వినియోగ వస్తువుల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం (చిల్లర ద్రవ్యోల్బణం) జూలై నెలలో తొమ్మిది నెలల కనిష్ట స్థాయి 4.17 శాతానికి తగ్గింది. ఆహార వస్తువుల ధరలు తగ్గడం వల్లనే జూలైలో చిల్లర ద్రవ్యోల్బణం తగ్గింది. రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రతి రెండు నెలలకు ఒకసారి ద్రవ్య పరపతి విధానానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే సమయంలో పరిగణనలోకి తీసుకునే కీలకాంశాలలో చిల్లర ద్రవ్యోల్బణం ఒకటి.