బిజినెస్

రూ. 10,585 కోట్లు ఈక్విటీ ఎంఎఫ్‌లలోకి జూలైలో తరలివచ్చిన నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లు ఇటీవల మదుపరులను బాగా ఆకట్టుకున్నాయి. మదుపరులు జూలై నెలలో భారీగా రూ. 10,585 కోట్ల నిధులను ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ (ఈక్విటీ ఎంఎఫ్)లలో పెట్టుబడులుగా పెట్టారు. ప్రధానంగా కార్పొరేట్ కంపెనీలు జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆకర్షణీయమయిన లాభాలను ఆర్జించడం, రుతుపవనాల పురోగమనం ఈసారి సానుకూలంగా ఉండటం వల్ల మదుపరులు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపారు. మదుపరులు జూలైలో పెట్టిన తాజా పెట్టుబడులతో కలుపుకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్-జూలై)లో ఇప్పటి వరకు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌లలోకి వచ్చిన నిధుల మొత్తం రూ. 43,300 కోట్లను దాటింది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్‌ఐ) గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. భారీగా నిధులు రావడం వల్ల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్‌ల అసెట్ బేస్ జూలై నెల చివరి నాటికి పది శాతానికి పైగా పుంజుకొని, రూ. 8.3 లక్షల కోట్లకు చేరుకుంది. వీటి అసెట్ బేస్ మార్చి నెల చివరి నాటికి రూ. 7.5 లక్షల కోట్లు మాత్రమే ఉండింది.