బిజినెస్

రూపాయి మరింత పతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 16: రూపాయి పతనం గురువారం కూడా కొనసాగింది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో గురువారం అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 16 పైసలు పడిపోయి, 70.15 వద్ద ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 70 మార్కుకన్నా కిందికి దిగజారడం చరిత్రలో ఇదే మొదటిసారి. టర్కీ కరెన్సీ సంక్షోభం ప్రతికూల ప్రభావం వల్ల రూపాయి బలహీనపడుతోంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే టర్కీ కరెన్సీ లీరా బలహీనపడుతుండటం అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలకు ముప్పుగా పరిణమించింది.ఇదిలా ఉండగా, రూపాయి బలహీనపడటం కొన్ని రంగాలకు స్వల్ప కాలంలో ప్రయోజనకరమేనని ఎగుమతిదారులు గురువారం పేర్కొన్నారు. అయితే, రూపాయి విలువ 70 మార్కుకు సమీపంలోనే కొనసాగితే, గ్లోబల్ బయ్యర్లు (కొనుగోలుదారులు) డిస్కౌంట్లు అడిగే అవకాశాలు కూడా ఉన్నాయని వారు వివరించారు. మన ఎగుమతులకు బిల్లులు ఎక్కువ మట్టుకు డాలర్ల రూపంలో చెల్లిస్తారని, అందువల్ల అలాంటి ఎగుమతిదారులు రూపాయి విలువ తగ్గడం వల్ల ఎక్కువ డాలర్లను స్వీకరించడం ద్వారా ప్రయోజనం పొందుతారని ఇండియన్ సిల్క్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చైర్మన్ సతీశ్ గుప్తా తెలిపారు. అయితే, కొనుగోలుదారులు కూడా తెలివయిన వారని, వారు ఇప్పటి వరకు డిస్కౌంట్లు అడగకపోయినప్పటికీ, మున్ముందు డాలర్‌తో రూపాయి మారకం విలువ 70 వద్దే కొనసాగితే, తమకు డిస్కౌంట్లు ఇవ్వాలని అడగడం ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు.ఊహించని ప్రపంచ పరిణామాల వల్ల రూపాయి మారకం విలువలో తీవ్రమయిన అనిశ్చితి చోటు చేసుకుందని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు.