బిజినెస్

మార్కెట్లకు టర్కీ సంక్షోభం దెబ్బ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదుపరులను వెంటాడిన రూపాయి బలహీనత ఖ 188 పాయింట్లు తగ్గిన సెనె్సక్స్ ఖ 11,400 దిగువకు నిఫ్టీ
ముంబయి, ఆగస్టు 16: రూపాయి విలువ పడిపోవడం, టర్కీ ఆర్థిక సంక్షోభం గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లను దెబ్బతీసింది. నిస్తేజకరంగా ఉన్న స్థూలార్థిక గణాంకాలు కూడా మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 188 పాయింట్లు పడిపోయి 37,663.56 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ 50.50 పాయింట్లు దిగజారి, మానసికంగా కీలకమయిన 11,400 స్థాయికన్నా దిగువకు దిగజారింది. దేశంలోనుంచి విదేశీ ఫండ్‌లు నిరంతరాయంగా తరలిపోతుండటం వల్ల గురువారం ఇంట్రా-డేలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 70.40కు పడిపోయింది. ఇతర ఆసియా దేశాల నుంచి బలహీనమయిన సంకేతాలు అందడంతో పాటు టర్కీ కరెన్సీ సంక్షోభం, చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందన్న ఆందోళనలు దలాల్ స్ట్రీట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని బ్రోకర్లు చెప్పారు. భారత్ వాణిజ్య లోటు జూలై నెలలో అయిదేళ్ల గరిష్ఠ స్థాయిలో 18 బిలియన్ డాలర్లకు పెరగడం దేశీయ మార్కెట్లను మరింత దెబ్బతీసింది.
సెనె్సక్స్ గురువారం ఉదయం దిగువ స్థాయి 37,796.01 పాయింట్ల వద్ద ప్రారంభమయి, తరువాత మరింత పడిపోయి కనిష్ట స్థాయి అయిన 37,634.43 పాయింట్లను తాకింది. ఈ దశలో ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, టాటా మోటార్స్ షేర్లలో వచ్చిన ర్యాలీ ఈ సూచీకి చేయూతనిచ్చింది. చివరకు సెనె్సక్స్ మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే 188.44 పాయింట్ల (0.50 శాతం) దిగువన 37,663.56 పాయింట్ల వద్ద ముగిసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టాక్ మార్కెట్ బుధవారం పనిచేయలేదు.
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా గురువారం సెషన్‌లో ఎక్కువ భాగం ప్రతికూల జోన్‌లోనే సాగి, కీలకమయిన 11,400 మార్కుకన్నా కిందికి దిగజారి, 11,366.25 పాయింట్ల కనిష్ట స్థాయిని తాకింది. తరువాత ఈ సూచీ స్వల్పంగా పుంజుకున్నప్పటికీ, క్రితం ముగింపుతో పోలిస్తే 50.05 పాయింట్ల (0.44 శాతం) దిగువన 11,385.05 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇదిలా ఉండగా, విదేశీ సంస్థాగత మదుపరులు (ఎఫ్‌ఐఐలు) మంగళవారం నికరంగా రూ. 378.84 కోట్ల విలువయిన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) రూ. 391.47 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేశారు.దేశ వాణిజ్య లోటు పెరగడం వల్లనే రూపాయి విలువ పడిపోయి, దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.
సెనె్సక్స్ ప్యాక్‌లోని సంస్థల్లో కోటక్ బ్యాంక్ గురువారం అత్యధికంగా 3.62 శాతం నష్టపోయింది. కోటక్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్ ఇటీవల జరిపిన స్టాక్ డైల్యూషన్ తాను జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా లేదని రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) మంగళవారం చేసిన వ్యాఖ్యలతో ఈ బ్యాంక్ షేర్ విలువ దెబ్బతిన్నది. నష్టపోయిన ఇతర సంస్థల్లో యెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఎస్‌బీఐ ఉన్నాయి. ప్రధానంగా మదుపరులు లాభాల స్వీకరణకు పూనుకోవడం వల్ల వీటి షేర్ల విలువ 0.80 శాతం వరకు పడిపోయింది.