బిజినెస్

ఐపీపీబీ ప్రారంభోత్సవం వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజపేయి మృతికి నివాళిగా దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నందున ఐపీపీబీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ముందు ప్రకటించిన షెడ్యూలు ప్రకారం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 21వ తేదీన ఐపీపీబీని ప్రారంభించవలసి ఉంది. ఐపీపీబీని ప్రారంభించే కొత్త తేదీని తరువాత ప్రకటించడం జరుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి. పూర్తి అయిదేళ్ల టర్మ్ ప్రధానమంత్రిగా పనిచేసిన తొలి కాంగ్రెస్‌యేతర నేత వాజపేయి దీర్ఘకాలం పాటు అస్వస్థతగా ఉండి, గురువారం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో మృతి చెందారు. ప్రభుత్వం వాజపేయికి నివాళిగా దేశవ్యాప్తంగా శుక్రవారం సెలవు దినాన్ని, వారం రోజుల పాటు సంతాప దినాలను పాటించాలని ప్రకటించింది. దీంతో ఐపీపీబీ ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా 650 ఐపీపీబీ శాఖలను ప్రారంభించడానికి ప్రణాళిక రూపొందించింది. ఈ సంవత్సరాంతం చివరి నాటికి దేశవ్యాప్తంగా గల 1.55 లక్షల పోస్ట్ ఆఫీస్ బ్రాంచీలు ఐపీపీబీకి అనుసంధానం కానున్నాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించిన దేశంలోనే అతి పెద్ద బ్యాంకింగ్ నెట్‌వర్క్ ఏర్పడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 1.3 లక్షల తపాలా కార్యాలయాల ద్వారా ఆయా గ్రామాలకు, పొరుగున ఉన్న గ్రామాలకు బ్యాంకింగ్ సేవలు అందనున్నాయి.