బిజినెస్

విస్తరిస్తున్న పీసీ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: దేశంలో పర్సనల్ కంప్యూటర్ (పీసీ) మార్కెట్ శర వేగంతో విస్తరిస్తున్నది. డిమాండ్ కూడా రోజురోజుకూ పెరుగుతున్నది. ఈ విషయాన్ని అంతర్జాతీయ డాటా కార్పొరేషన్ (ఐడీసీ) తన నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మాసాల మధ్య పీసీ మార్కెట్ 28.1 శాతం పెరిగిందని తెలిపింది. దీనితో పీసీల అమ్మకం 2.25 మిలియన్ యూనిట్లకు చేరింది. హెచ్‌సీ ఇంటర్నేషనల్ సంస్థ పీసీ మార్కెట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. మొత్తం మార్కెట్‌లో ఈ సంస్థ వాటా 31.6 శాతం కావడం విశేషం. ఈ జాబితాలో డెల్ రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఆ సంస్థ పీసీ అమ్మకాల్లో 23.7 శాతం వాటాను కలిగి ఉంది. లెనొవో 18 శాతంతో మూడో స్థానంలో ఉంది. 2017 చివరి నుంచి పీసీల అమ్మకాలు విపరీతంగా పెరిగాయని, భవిష్యత్తులో మరింత పెరగనుందని ఐడీసీ నివేదిక స్పష్టం చేస్తున్నది. భారత మార్కెట్‌లో నోట్‌బుక్స్‌ది 61 శాతం. పీసీలు క్రమంగా పుంజుకొని, నోట్‌బుక్స్ స్థానాన్ని భర్తీ చేస్తున్నాయి.