బిజినెస్

గనుల అనే్వషణలో ప్రైవేటు భాగస్వామ్యం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: బొగ్గును మినహాయించి, మిగతా లోహాలకు సంబంధించిన గనుల అనే్వషణకు ప్రైవేటు భాగస్వామ్యాన్ని కేంద్రం ఆహ్వానిస్తున్నది. ఏటా పెరుగుతున్న డిమాండ్‌కు సరిపర ఉత్పత్తి లేకపోవడంతో, కొత్త గనులను కనుక్కోవడం, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం అత్యవసరమైంది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని, గనుల అనే్వషణలో ప్రైవేటు భాగస్వామ్యానికి త్వరలోనే అవకాశం కల్పించే ఆలోచన ఉన్నట్టు గనుల విభాగం సంయుక్త కార్యదర్శి బిపుల్ పాఠక్ తెలిపారు. శుక్రవారం గనుల అనే్వషణ, స్థిరత్వం అనే అంశంపై ఇక్కడ జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ, ప్రైవేటు సంస్థలు కొనసాగించే గనుల అనే్వషణకు అవసరమైన నిధులను కేటాయించాలన్న ఆలోచన కూడా ఉందని చెప్పారు. దీని ద్వారా గనుల అనే్వషణ వేగవంతమవుతుందని అన్నారు. ఇక నుంచి ఏటా గనులు రెట్టింపు కావాలన్నదే తన అభిప్రాయమన్నారు. ప్రభుత్వం కూడా అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. ప్రస్తుతం గనుల అనే్వషణను నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్టు (ఎంఎన్‌ఈటీ) నిర్వహిస్తోంది. అయితే, డిమాండ్‌కు తగిన స్థాయిలో గనులను కనుక్కోవడం సాధ్యపడడం లేదు. అందుకే, ప్రైవేటు భాగస్వామ్యాన్ని స్వాగతించడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేస్తున్నది.