బిజినెస్

మళ్లీ బలపడిన మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ప్రపంచ సానుకూల సంకేతాల మధ్య ఎఫ్‌ఎంసీజీ, లోహ, బ్యాంకింగ్ షేర్లు రాణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం తిరిగి బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 284 పాయింట్లు పుంజుకోగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 11,470.75 పాయింట్ల వద్ద ముగిసింది. వాణిజ్య చర్చలు తిరిగి ప్రారంభించాలని అమెరికా, చైనా అంగీకారానికి రావడం వల్ల ప్రపంచ స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి నెలకొనడంతో పాటు దేశీయ సంస్థాగత మదుపరులు (డీఐఐలు) ఎడతెరిపి లేకుండా కొనుగోళ్లు జరపడం వల్ల దేశీయ మార్కెట్లలో సెంటిమెంట్ బలపడిందని బ్రోకర్లు చెప్పారు. బీఎస్‌ఈ సెనె్సక్స్ శుక్రవారం సెషన్ అంతా సానుకూల ధోరణిలోనే కొనసాగింది. ఒక దశలో ఈ సూచీ గరిష్ఠ స్థాయి 38,022.32 పాయింట్లను తాకింది. చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 284.32 పాయింట్ల (0.75 శాతం) ఎగువన 37,947.88 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ క్రితం ముగింపుతో పోలిస్తే 85.70 పాయింట్లు (0.75 శాతం) ఎగువన సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయి 11,470.75 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఆగస్టు 9వ తేదీనాటి గరిష్ఠ స్థాయి క్లోజింగ్ అయిన 11,470.70 పాయింట్లను శుక్రవారం అధిగమించింది. ఇదిలా ఉండగా, మార్కెట్ కీలక సూచీలు పుంజుకోవడం ఇది వరుసగా నాలుగో వారం. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో సెనె్సక్స్ 78.65 పాయింట్లు (0.21 శాతం) పుంజుకోగా, నిఫ్టీ 41.25 పాయింట్లు (0.36 శాతం) పెరిగింది. కాగా, డీఐఐలు గురువారం నికరంగా రూ. 133.78 కోట్ల విలువయిన షేర్లను కొనుగోలు చేయగా, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇనె్వస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 825.08 కోట్ల విలువయిన షేర్లను విక్రయించారు.
సెనె్సక్స్ ప్యాక్‌లోని యెస్ బ్యాంక్ శుక్రవారం అత్యధికంగా 3.76 శాతం పెరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) 3.18 శాతం లాభంతో రెండో స్థానంలో నిలిచింది. లాభపడిన ఇతర సంస్థల్లో వేదాంత, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, ఐటీసీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఎంఅండ్‌ఎం, అదాని పోర్ట్స్ ఉన్నాయి. మరోవైపు, హీరో మోటోకార్ప్ షేర్ విలువ 1.14 శాతం పడిపోయింది. నష్టపోయిన ఇతర సంస్థలలో ఓఎన్‌జీసీ, మారుతి సుజుకి, కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో ఉన్నాయి. చమురు- సహజ వాయువు మినహా మిగతా రంగాల సూచీలన్నీ శుక్రవారం పుంజుకున్నాయి. బీఎస్‌ఈ ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 1.79 శాతం, మెటల్ 1.71 శాతం, బ్యాంకెక్స్ 1.27 శాతం, హెల్త్‌కేర్ 1.25 శాతం చొప్పున పుంజుకున్నాయి.