బిజినెస్

ప్రచారమే.. నిజం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 18: తమ హయాంలో ఆర్థిక వృద్ధి రేటు అద్భుతంగా పెరిగిందని, ఎన్నో రంగాల్లో దేశం అభివృద్ధి సాధించిందని యూపీఏ సర్కారు ప్రచారం చేసుకుందే తప్ప అందులో నిజం లేదని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ) స్పష్టం చేసింది. నిజానికి యూపీఏ హయాంలో సూక్ష్మ ఆర్థిక వ్యవస్థలో నిలకడ లోపించిందని వ్యాఖ్యానించింది. వివిధ రంగాల వాస్తవ గణాంకాల ప్రకారం 2006-07 ఆర్థిక సంవత్సరంలో, మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు 10.08 శాతం వృద్ధిరేటు సాధించింది. 1991లో సరళీకృత ఆర్థిక విధానం ఆరంభానికి ముందుగానీ, ఆతర్వాతగానీ ఆ స్థాయిలో వృద్ధిరేటు ఎన్నడూ నమోదు కాలేదు. అయితే, యూపీఏ హయాంలో ఆర్థిక పరిస్థితి చెప్పుకున్నంత అద్భుతంగా లేదని ఈఏసీ సభ్యుడు సుర్జీత్ భల్లా వ్యాఖ్యానించారు. యూపీఏ కాలంలో అత్యధిక వృద్ధి రేటు నమోదైందని పుకార్లు వ్యాప్తిలో ఉన్నాయని, అందుకే ఏ పథకానికీ అమల్లో ఆటంకాలు ఏర్పడలేదన్న వాదన చాలాకాలంగా వినిపిస్తున్నదని భల్లా అన్నారు. అయితే, గణాంకాలను పరిశీలిస్తే, యూపీఏ పాలనలో సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ పదేపదే మార్పులకు లోనైందని చెప్పారు. స్థూల దేశీయ ఉత్పత్తి (జీడీఏ) వివరాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందన్నారు.
2004-05 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2011-12 ఆర్థిక సంవత్సరంలో ధరల సూచిక తులనాత్మక పరిశీలనలో అనేక వాస్తవాలు వెల్లడయ్యాయని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు వృద్ధిరేటు అధికంగా ఉందనేది నిజం కాదని చెప్పారు.