బిజినెస్

తొమ్మిది కంపెనీల లావాదేవీలు బంద్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: మెహుల్ చొక్సీకి చెం దిన గీతాంజలి జెమ్స్‌సహా మొత్తం తొమ్మి ది కంపెనీలపై వేటు పడింది. సెప్టెంబర్ పదో తేదీ నుంచి బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ) తోపాటు నేషనల్ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లోనూ ట్రేడింగ్‌ను నిలిచిపోనున్నాయి. లిస్టింగ్ ప్రక్రియను సక్రమంగా పూర్తి చేయని కారణంగా ఈ కంపెనీల లావాదేవీలను నిషేధిస్తున్నట్టు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ ప్రకటించాయి. లిస్టింగ్ లాంఛనాలు, ప్రకటన అవసరాలు (ఎల్‌ఓడీఆర్) జాబితాలో ఒకవేళ ఈ తొమ్మిది కంపెనీల్లో ఏవైనా ఉంటే, లావాదేవీల నిషేధం వర్తించదు. వాస్తవానికి అన్ని కంపెనీలు ఈనెల 17వ తేదీలోగా లిస్టింగ్ ధ్రువీకరణకు అవసరమైన అన్ని లాంఛనాలను పూర్తి చేయాల్సి ఉం టుంది. కానీ, గీతాంజలి జెమ్స్, ఆంటెక్ ఆటో, ఈసన్ రెరోల్, పనోరామిక్ యూనివర్శల్ కంపెనీలు ఈ లాంఛనాలను పూర్తి చేయలేదు. నోబెల్ పాలీమార్స్, సంవృద్ధి రియాలిటీ, థాంబీ మోడ్రన్ స్పిన్నింగ్ మిల్స్, ఇండో పసిఫిక్ ప్రాజెక్ట్స్, హర్యానా ఫైనాన్స్ కార్పొరేషన్ లిస్టింగ్ ప్రక్రియను పూర్తి చేయని కారణంగా వాటి లావాదేవీలపై వేటు పడనుంది.