బిజినెస్

ప్రపంచ పరిణామాలే ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు, టర్కీ కరెన్సీ లీరా, రూపాయి కదలికలపైనే మదుపరుల దృష్టి కేంద్రీకృతమయి ఉంటుందని, సోమవారం నుంచి మొదలయ్యే వచ్చే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్ల ధోరణిని ఈ అంశాలే నిర్దేశించనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ‘వచ్చే వారం సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 22, 23 తేదీలలో అమెరికాతో చైనా ప్రతినిధుల బృందం జరిపే చర్చలు సానుకూల ఫలితాలను ఇస్తాయని మదుపరులు భావిస్తున్నారు’ అని హెమ్ సెక్యూరిటీస్ డైరెక్టర్ గౌరవ్ జైన్ పేర్కొన్నారు. ‘అమెరికా, చైనా మధ్య ఇటీవలి తాజా చర్చలను, ముడి చమురు ధరల కదలికను పరిశీలించడం ఎంతో ముఖ్యం. టర్కీ కరెన్సీ లీరా ఏమైనా పుంజుకున్నా, అమెరికా-టర్కీ మధ్య సంబంధాలు ఏమైనా కుదుటపడినా స్వల్ప కాలంలో భారత కరెన్సీ రూపాయికి ఊరట కలుగుతుంది’ అని ఎపిక్ రీసెర్చ్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) ముస్త్ఫా నదీమ్ పేర్కొన్నారు. బుధవారం వెలువడే ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) మినట్స్‌పై కూడా మదుపరులు దృష్టి సారిస్తారు. ‘కార్పొరేట్ కంపెనీల జూన్ త్రైమాసిక ఫలితాలు వెలువడే సీజన్ ముగిసిపోయింది. అందువల్ల ఇప్పుడు దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లను అనుసరిస్తుంటాయి. వచ్చే వారంలో ఆయా స్టాక్‌ల పనితీరును బట్టి వాటి ధరల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మార్కెట్‌లో ఊగిసలాటలు చోటు చేసుకుంటాయి’ అని ఈక్విటీ 99 సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. శుక్రవారంతో ముగిసిన ఈ వారంలో బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ 78.65 పాయింట్లు (0.21 శాతం) పుంజుకొని, 37,947.88 పాయింట్ల వద్ద ముగిసింది.