బిజినెస్

వర్షాలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి విఘాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఆగస్టు 20: ఆదివారం నుంచి క్షణం తీరిక లేకుండా కురుస్తున్న విస్తారమైన వర్షాలతో సింగరేణి బొగ్గు పరిశ్రమలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర విఘాతం కలిగింది. రోజూ లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగే ఓపెన్ కాస్ట్ మైన్స్‌లో వర్షం తీవ్ర ప్రతిబంధకంగా మారింది. రామగుండం రీజియన్‌లోని ఓసీపీ-1, 2, 3, 4 ప్రాజెక్టుల్లో సుమారు 48వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌ల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో సింగరేణి బొగ్గు పరిశ్రమకు చెందిన ఉన్నతాధికారులు యుద్ధప్రాతిపదికన ఓపెన్ కాస్టుల్లో చేరిన వరద నీటిని ప్రత్యేక పంపుల ద్వారా బయటకు వదులుతున్నారు. అదేవిధంగా ఓసీపీల్లో ఉన్న భారీ యంత్రాలు కూడా వర్షం మూలంగా చెడి పోకుండా ప్రత్యామ్నాయ చర్యలను చేపట్టారు. సింగరేణిలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో వర్షాల కారణంగా భారీ డంపర్లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.